Anchor Suma : అయ్య బాబోయ్ సుమ యాంకరింగా… వద్దంటూ దండం పెట్టేస్తున్న నెటిజన్లు

Anchor Suma : సుమ కనకాల… ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించి స్టార్ యాంకర్ గా మారిన సుమకు బుల్లితెర నుంచి వెండితెర దాకా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకర్ గా కొనసాగుతూ తనలా సక్సెస్ ఫుల్ యాంకర్ కావాలనుకునే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇక పెద్ద సినిమాలకు సంబంధించిన ఎలాంటి ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఉండాల్సిందే.

లేదంటే ఆ ఈవెంట్ సక్సెస్ అయినట్టుగా అనిపించదు, అలాగే ఆమె లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. పైగా స్టార్ హీరోల ఈవెంట్లను మేనేజ్ చేయగల సత్తా ఇప్పుడున్న యాంకర్లలో సుమకు మాత్రమే ఉంది అనేది చాలామంది అభిప్రాయం. అలాంటిది తాజా పరిస్థితి చూస్తుంటే సుమ యాంకరింగ్ జనాలకు బోర్ కొట్టినట్టుగా అనిపిస్తుంది.

ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రెండు పెద్ద సినిమాల ఈవెంట్స్ కు సుమ హోస్టుగా వ్యవహరించాల్సి ఉంది. “గుంటూరు కారం” మూవీకి, “హనుమాన్” మూవీ ఈవెంట్ కు సుమనే యాంకర్ గా అనుకున్నారు. కానీ అనుకోకుండా “గుంటూరు కారం” మూవీ ఈవెంట్ పోస్ట్ పోన్ కావడంతో, ఇప్పుడు “హనుమాన్” మూవీ ఈవెంట్ ను మాత్రమే హోస్ట్ చేయబోతోంది సుమ. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు అయ్య బాబోయ్ సుమ యాంకరింగా? వద్దంటూ దండం పెట్టేస్తున్నారు.

- Advertisement -

ఈరోజుల్లో సుమ యాంకరింగ్ భరించలేకపోతున్నామని, ఆమె యాంకరింగ్ చేసే విధానం ఇరిటేటింగ్ గా ఉంటుందని, ఆమె ఎప్పుడూ పేల్చే అవే జోకులు విని విని బోర్ వచ్చేసిందని అంటున్నారు. సుమ చేసే ఓవర్ యాక్షన్ తట్టుకోలేమని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు పైగా కొత్త యాంకర్ ను చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

కానీ కొంతమంది మాత్రం సుమకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఈ ఈవెంట్ కాకపోతే ఇంకొక ఈవెంట్ చేస్తుందనీ, ఇంకొన్ని ఏళ్ల పాటు ఆమెకు రీప్లేస్మెంట్ లేదనీ, సుమ లేకపోతే ఈవెంట్ చాలా బోర్ కొడుతుందని, బిగ్ స్టార్స్ ఈవెంట్ ని సుమ ఒక్కతే హ్యాండిల్ చేయగలరని అంటున్నారు. పైగా స్టార్ హీరోలు తమ సినిమాలకు సుమ యాంకరింగ్ చేయడానికి సెంటిమెంట్ గా భావిస్తారని గుర్తు చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం సుమ యాంకరింగ్ బోర్ కొట్టేసిందని, ఆమె ప్లేస్ లో మరో యాంకర్ ను రీప్లేస్ చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా ఇదంతా చూస్తుంటే సుమకు యాంకర్ గా కాలం చెల్లిపోయినట్టుగా అనిపిస్తుంది. పైగా ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఈవెంట్స్ లో సుమ వ్యవహరించిన తీరుపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. సినిమాలకు సంబంధించిన అప్డేట్లు పెద్ద వేదికపై తప్పు తప్పుగా చెబుతూ ఉండడంతో ఆమెకు మతిమరుపు వచ్చిందంటూ మండిపడ్డారు. యాంకర్ గా ఇండస్ట్రీలో సుమ స్థాయిలో నిలదొక్కుకోవాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్. మరి ఆ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారు అనేది వేచి చూడాలి

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు