Sreeja : ఇదేం ట్విస్ట్ కాకా.. శ్రీజ గురించి వెలుగులోకి మరో నిజం..!

Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.. గతంలో పెద్దలను ఎదురించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. అది మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో మనం చూశాం.. ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయింది.. అప్పుడు పాప కూడా ఉంది.. రెండేళ్ల తర్వాత మరొకరికితో పెళ్లి జరిగింది.. అది కూడా ఇప్పుడు పెటాకులు అయ్యింది.. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతుంది.. శ్రీజ తన కొడుకు గురించి సీక్రెట్ గా దాచి పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి..

శ్రీజకు రెండు పెళ్లిళ్లు జరిగినప్పటికీ మొదటి పెళ్లి జరిగిన సమయంలో కూతురే పుట్టింది.. ఇక కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.. అప్పుడు కూడా కూతురే పుట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే.. అలా ఇప్పటివరకు చిరంజీవి సంతానం ముగ్గురికి కూడా కూతుర్లే పుట్టారు. కానీ అబ్బాయిలు పుట్టలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే శ్రీజకు కొడుకు కూడా ఉన్నాడని వార్త ఇండస్ట్రీని ఊపేస్తుంది.. ఏంటి ట్విస్ట్ ఇచ్చారుగా.. అస్సలు నమ్మలేకున్నాం అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

News about Srija Konidela's son is heard on social media
News about Srija Konidela’s son is heard on social media

శ్రీజ కి కూతురే కాదు కొడుకు కూడా ఉన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తల్లి శ్రీజకు కొడుకు కూడా ఉన్నాడు.. అయితే కూతురిని మాత్రమే తీసుకొని వచ్చేసింది అని చెప్పినట్లు గతంలో చాలా సార్లు వార్తలు వినిపించాయి.. ఈ మధ్య శ్రీజ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది.. అసలు శ్రీజ, కళ్యాణ్ విడాకులు తీసుకున్నారా? లేదా మళ్లీ కలుస్తారా? అస్సలు శ్రీజకు ఎంతమంది పిల్లలు ఉన్నారనే ప్రశ్నలు మొదలవుతున్నాయి.. మరి ఈ వార్తలకు మెగా ఫ్యామిలీ గానీ, శ్రీజ గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఏదేమైనా ప్రజెంట్ ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు