Niharika – Chaitanya: మళ్లీ ఒక్కటి కానున్న నిహారిక -చైతన్య.. నిజమేనా..?

మెగా వారసురాలు నిహారిక.. చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లి జైపూర్ లో చాలా గ్రాండ్గా జరిగింది. నాగబాబు తనకున్న ఒక్కగానొక్క కూతురు పెళ్లిని చాలా గ్రాండ్ గా చేశారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఎన్నో వార్తలు అప్పట్లో మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే కరోనా సమయం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని తక్కువ మంది సమక్షంలో వీరి వివాహం జరిపించారు. ఇక వివాహం అనంతరం సంతోషంగా ఉంటారు అనుకున్న సమయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. పెళ్లయిన కొద్ది రోజులకే ఇలా భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.

అప్పటినుంచి ఎవరి జీవితం వారిది అన్నట్టుగా బ్రతుకుతున్నారు ఈ జంట. ఒకవైపు నిహారిక నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ బిజీగా ఉండగా.. అటు చైతన్య జొన్నలగడ్డ కూడా సోషల్ మీడియాలో యాక్టిివ్ గా వుంటూ.. అప్పుడప్పుడు ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతూ మరింత బిజీగా మారిపోయారు. ఇక వీరిద్దరూ కలిసే ఛాన్స్ లేదన్నట్టుగా ఎవరికి వారు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వీళ్ళిద్దరూ మొదటిసారి మెగా ఫ్యామిలీ సమక్షంలో మళ్లీ కలవబోతున్నారు అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.

అసలు విషయంలోకెళితే.. నిహారిక , జొన్నలగడ్డ చైతన్య ఇద్దరు కలిసి ఉన్న సమయంలో తమకు సంబంధించి ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవడానికి ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేశారట. అయితే ఆ ఫ్లాట్ లో ఇల్లు కట్టే సమయంలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారని సమాచారం .అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ ను వేరే వాళ్లకు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఆ ఫ్లాట్ కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇద్దరు సంతకాలు కావాలని చెప్పడంతో.. ఇప్పుడు వీరిద్దరూ మెగా ఫ్యామిలీ సమక్షంలో మళ్లీ కలిసి రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. కనీసం ఇలా అయినా ఇద్దరు తమ మనసులను మార్చుకొని మళ్లీ ఒక్కటి కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన వేళ అంతా శుభమే జరుగుతుంది అని కూడా మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరూ మళ్లీ కలుస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు