Kollywood: నెటిజన్లకు దిమ్మ తిరిగేలా కౌంటరేసిన నిత్యా..!

Kollywood:

కేరళ కుట్టి నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ ని తన పెర్ఫార్మన్స్ తో మెప్పించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో కాకపోయినా, మంచి కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ తన పేరుని నిలుపుకుంటుంది. ఒక రకంగా సౌందర్య తర్వాత ఎక్స్ పోజింగ్ సినిమాలు నో చెప్తూ కంటెంట్ బేస్డ్ సినిమాలకే ఒకే చెప్తూ, హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది.

ఇక ముందు నుండి గ్లామర్ షో కి దూరంగా ఉంటూ తన రోల్ కి ఇంపార్టెన్స్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తూ వచ్చింది. అందుకే ఇక్కడ ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఆమెలో ఉన్న ఇంకో ప్రత్యేకమైన లక్షణం ముక్కు సూటిదనం. అవును… పాత్ర తాలూకా తీరుతెన్నులు నచ్చకపోతే వెంటనే ఆ సినిమాని తిరస్కరిస్తుంది. ఇకపోతే నిత్యా మీనన్ స్టార్ హీరోయిన్లలా కాకపోయినా, ముందు నుండి బిజీ గానే ఉంటూ ఆఫర్లు అందుకుంటూ సినిమాలు చేస్తుంది.

లాస్ట్ ఇయర్ తమిళ్ లో ధనుష్ తో కలిసి నటించిన ‘తిరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టగా, తాజాగా ఆమె నటించిన ‘శ్రీమతి కుమారి’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నిత్యా మీనన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్లు తెలిపినట్లు, ఓ సినిమా షూటింగ్ టైం లో తమిళ్ హీరో తనను లై***గిక వేధింపులకు గురి చేసినట్లు గత కొద్దీ రోజులుగా కోలీవుడ్ సోషల్ మీడియా లో న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే ఫైనల్ గా నిత్యా మీనన్ ఈ వార్తలపై స్పందిస్తూ, తనపై వచ్చిన ఈ వార్తలన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పేసింది. ఈ వార్తలపై తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ, ఇలాంటి తప్పుడు వార్తలు రాయడానికి సిగ్గుండాలి.. నేనెప్పుడూ ఏ ఇంటర్వ్యూ లో కూడా ఇలా చెప్పలేదు, అంటూ, ఆ న్యూస్ రాసిన కొన్ని అకౌంట్స్ పేజీ ల స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ న్యూస్ తెగ వైరల్ అయింది.

కొందరు నెటిజన్లు ఇలాంటి చిల్లర వార్తల గురించి నిత్య స్పందించడం అనవసరం, ఇలాంటి నెగిటివ్ న్యూస్ లు సెలబ్రిటీల పైన రాయడం మామూలే, అంటుండగా, ఫ్యాన్స్ మాత్రం ఎవరో ఒకరు చెప్తే గాని ఇలాంటి వాళ్ళు నోరు మూసుకోరు అంటూ నిత్యా ట్వీట్స్ కు లైక్స్ కొడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు