Niveda Thomas: పెళ్లి చేసుకోబోతున్న నివేదా థామస్.. పోస్ట్ వైరల్..!

Niveda Thomas.. ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాని హీరోగా 2 వ సారి జతకట్టి నిన్ను కోరి సినిమాతో ఇండస్ట్రీలో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ అందుకొని కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తోంది ఈ కేరళ చిన్నది.. ఇకపోతే తెలుగులో కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈమె నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు. ఆ తర్వాత రెండో మూవీ కూడా నానితోనే చేసి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. అలా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్న ఈమె.. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118 సినిమాలలో నటించి.. ఆ తర్వాత బ్రోచేవారెవరు రా అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా..

Niveda Thomas: Niveda Thomas is going to get married.. The post is viral..!
Niveda Thomas: Niveda Thomas is going to get married.. The post is viral..!

హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. దర్బార్ చిత్రంలో రజనీకాంత్ కూతురుగా నటించి అలరించిన నివేదా థామస్… పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో మెయిన్ లీడ్ పోషించింది.

ఇండస్ట్రీ కి లాంగ్ గ్యాప్..

ఇకపోతే ఏమైందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో లాంగ్ గ్యాప్ ఇచ్చిందని చెప్పాలి..చివరిగా షాకిని డాకిని అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా కొరియన్ రీమేక్ గా తెరకెక్కడంతో మూవీ లవర్స్ ను మెప్పించలేకపోయింది. ఒకరకంగా చెప్పాలంటే బ్రోచేవారెవరు రా సినిమానీ ఈమెకు చివరి హిట్ అని చెప్పవచ్చు.. ఇకపోతే సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను అనౌన్స్ చేయలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. ఇక అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే ఈమె .. తన సోదరుడితో కలిసి చేసే స్టెప్పులు, డాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఈమె ఫోటోకి అనేక మంది నెటిజన్స్. తప్పుగా కామెంట్లు పెట్టారు.. అంతేకాదు పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు.. అయితే వీటి పైన ఆమె స్పందించలేదు…

- Advertisement -

పెళ్లి పీటలు ఎక్కనున్న నివేదా.. పోస్ట్ వైరల్..!

కానీ ఇప్పుడు ఈమె చేసిన లేటెస్ట్ పోస్ట్ చాలా వైరల్ గా మారుతుంది. మరి నివేదా చేసిన పోస్ట్ ఏంటి అంటే .. చాలా కాలం గడిచింది.. బట్ ఫైనల్లీ అంటూ రాసుకు వచ్చింది నివేదా.. అలాగే లవ్ ఎమోజిని కూడా యాడ్ చేసింది.. దీంతో ఈమె పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్ .. ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ కామెంట్స్ చేయగా.. మరి కొంతమంది కొత్త సినిమాని అనౌన్స్ చేస్తుందేమో అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం నివేదా చేసిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. మరి నివేదా ఈ పోస్టు పెళ్లి గురించి చేసిందా ? లేక కొత్త సినిమా కోసం చేసిందా? అనే విషయంపై ఆమెనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు