Kajal : గ్యాప్ వచ్చినా.. డిమాండ్ తగ్గలేదు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లీలు అయిన తర్వాత మళ్లీ తెరపై కనిపించడం చాలా అరుదు. నిజానికి పెళ్లి తర్వాత హీరోయిన్లకు సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని ఉన్నా.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం కష్టమే. కానీ, ప్రస్తుతం సీన్ మారింది. పెళ్లి అయినా హీరోయిన్స్ కూడా రాణిస్తున్నారు. బాలీవుడ్ లో దీపికా పదుకొణె, ఐశ్వర్య రాయ్ తో పాటు చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత తమ సినీ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు.

తెలుగులో కూడా హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చి, తమ సత్తా చాటుతున్నారు. సమంత పెళ్లి.. ఆ తర్వాత డైవర్స్ అయినా.. వరుసగా సినిమాలు చేస్తోంది. సామ్ తో పాటు చాలా మంది రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. పెళ్లి.. ప్రెగ్నెన్సీ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్.. తాజాగా రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది.

కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు2 లో కాజల్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక ముందే మరి కొన్ని సినిమాలకు సైన్ చేసే పనిలో కాజల్ ఉందట. అయితే ఇక్కడ కాజల్ రెమ్యునరేషన్ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. పెళ్లి అయినా, గ్యాప్ వచ్చినా రెమ్యునరేషన్ విషయంలో కాజల్ ఏ మాత్రం తగ్గడం లేదని టాక్.

- Advertisement -

ప్రస్తుతం కాజల్ ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కాజల్ కు ఉండే ఫ్యాన్ బేస్ కు, ఆమె ఆందానికి, అభినయానికి సరైన పారితోషికం అని కొంత మంది అంటున్నారు. అలాగే మరి కొందరు.. రీ ఎంట్రీని కాస్త నెమ్మదిగా ప్లాన్ చేయాలి.. కానీ, ఇలా భారీ రెమ్యునరేషన్ తో స్టార్ట్ చేస్తే అవకాశాలు వస్తాయా అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు