Gangs of Godavari movie: విశ్వక్ సేన్ గ్యాంగ్ కోసం బాలీవుడ్ ఐటెం బ్యూటీ స్టెప్స్‌

యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ ఓపినియన్ ను క్రియేట్ చేశాయి. అంతే కాదు, విశ్వక్ సేన్ ఇప్పటి వరకు చేయలేని మాస్ హై ఓల్టేజ్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ కృష్ణ చైతన్య విశ్వక్ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడట.

ఈ విషయం పక్కన పెడితే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందట. అందు కోసం బాలీవుడ్ ఐటెం బ్యూటీ నోరా ఫతేహిని ఫైనల్ చేశారని టాక్. నోరా ఫతేహి పేరుకి బాలీవుడ్ బ్యూటీ. కానీ ఆమెకి ఎక్కువ ఆఫర్స్ తెలుగులోనే వస్తున్నాయి. నోరా తెలుగులో ఇప్పటి వరకు టెంపర్, బాహుబలి, కిక్ 2, లోఫర్, ఊపిరి లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమాలో కూడా చేయబోతుంది.

నోరా ఫతేహికి యాక్టింగ్ కంటే, ఐటెం సాంగ్స్ ఆఫర్సే ఎక్కువగా వస్తున్నాయి. ఈమె బాలీవుడ్ లో రోర్ : టైగర్స్ ఆఫ్ ది సందర్భన్స్ అనే సినిమాతో నటిగా ఎంట్రి ఇచ్చింది. దీని ఫలితంతో సంబంధం లేకుండా, ఐటెం సాంగ్స్ ఆఫర్స్ రావడం గమనార్హం. అయితే ఎలాంటి పాటకు అయిన నోరా ఫతేహి వేసే స్టెప్స్ అలాగే ఆమె గ్లామర్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు