Venuswamy: జ్యోతిష్యం మాత్రమే కాదు అది కూడా.. కోట్లు ఘడిస్తున్న వేణుస్వామి..!

Venuswamy:  ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వివాదాస్పద జ్యోతిష్యుడుగా పేరు కూడా దక్కించుకున్నారు. సెలబ్రిటీల జాతకాలపైనే కాదు వారి వ్యక్తిగత జీవితాలు, కెరియర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలబ్రిటీలపై జ్యోతిష్యాలు చెప్పగా.. అందులో కొన్ని నిజమైనట్లు ప్రచారం కూడా ఉంది. వేణు స్వామి చేసే వ్యాఖ్యలు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈయన చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం వల్ల వివాదంగా మారుతూ ఆయనను మళ్ళీ వార్తల్లో నిలిచేలా చేస్తూ ఉంటాయి.

ఇకపోతే ఇటీవల బాహుబలి తర్వాత ప్రభాస్ కెరియర్ ఉండదని.. గతంలో వేణు స్వామి వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు సలార్ సూపర్ హిట్ కావడంతో ఆయనను ట్రోల్స్ చేస్తున్నారు.మరొకవైపు సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పి షాక్ ఇచ్చారు. ఇది నిజమయింది.. దీంతో సెలబ్రిటీలు కూడా ఈయన మాటలు నమ్మి.. రష్మిక, నిధి అగర్వాల్ , డింపుల్ హయతి లాంటి హీరోయిన్లు కూడా వేణు స్వామితో పూజలు చేయించుకుని తమ జాతకాలను మార్చుకున్నారు. ఉన్న విషయాన్ని ఖరాకండిగా చెబుతూ బోల్డ్ కామెంట్లు చేయడంలో ఈయన సిద్ధహస్తుడు. ఇదిలా వుండగా తాజాగా వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఆస్తుల గురించి కూడా వెల్లడించారు.

ముఖ్యంగా ఆయన చెప్పిన విషయాలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. వేణుస్వామి మాట్లాడుతూ.. నేను జాతకం మాత్రమే చెప్పను.. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా నా దగ్గరికి వస్తారు. సామాన్య ప్రజలకి కూడా నేను టైం కేటాయిస్తున్నాను.. ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నాను.. ఒక పబ్, వైన్ షాప్, రేంజ్ రోవర్ కార్ ఇంకా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి అంటూ వేణు స్వామి తెలిపారు..

- Advertisement -

జ్యోతిష్యం చెప్పేవాడి జాతకం బాగుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగేవారికి నా సంపాదన ఇది అని సమాధానం చెబుతాను.. నా రేంజ్ ఇది అని చెబుతాను అంటూ వేణు స్వామి తెలిపారు. ఇకపోతే వేణు స్వామితో పాటు ఈయన భార్య వీణా శ్రీవాణి గురించి అందరికీ తెలిసిందే. ఈమె సంగీతంలో ప్రావీణ్యురాలు. అందరిలాగే తాను కూడా తన భార్య కోసం ఆమెపై ప్రేమతో కసిగా సంపాదించినట్లు వేణు స్వామి ఫన్నీగా కామెంట్లు చేశారు. అంతే కాదు ప్రతి నెల తాను జీఎస్టీ , ట్యాక్స్ కూడా కడుతున్నట్లు వెల్లడించారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు