NTR 31: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకి హిరోయిన్ సెట్ అయినట్టేనా..

NTR 31: ప్రశాంత్ నిల్ కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసలైన గుర్తింపును సాధించుకున్నాడు. ఇప్పటికే దర్శకుడుగా కన్నడలో ఫిలిమ్స్ చేసిన కూడా కే జి ఎఫ్ సినిమా మాత్రమే ప్రశాంత్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. అంటే ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా చేయొచ్చు అంటూ ఒక కొత్త నిర్వచనాన్ని చూపించాడు. కే జి ఎఫ్ సినిమా చాలామందికి ఇప్పటికీ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఆ సినిమాలు యష్ చూపించిన విధానం, సీన్స్ ఎలివేట్ చేయటం, ఎమోషన్ ని హార్ట్ టచ్ చేయాలా డిజైన్ చేయడం ఇవన్నీ కూడా ఆ సినిమాకి అద్భుతంగా కలిసి వచ్చాయి.

కే జి ఎఫ్ సినిమా తో తెలుగులో అభిమానులు

బేసిగ్గా కన్నడ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎక్కడో ఇంకా వాళ్ళు వెనకబడ్డారు. అని ఒక అపోహ ఉండేది. వాటన్నిటికీ సక్సెస్ఫుల్ గా చెక్ పెట్టిన సినిమా మాత్రం కేజిఎఫ్ పని చెప్పాలి. ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా కూడా మంచి కలెక్షన్స్ను వసూలు చేసింది. ఇక్కడితో ప్రశాంత్ నీల్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటేనే అంచనాలు ఆకాశాన్ని అంటడం మొదలయ్యాయి.

Salaar

- Advertisement -

సలార్ ప్రభాస్ కు హిట్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించిన విషయం మనకు తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఆ సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆది పురష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఒక సరైన కమర్షియల్ హిట్ సినిమా ప్రభాస్ కి పడలేదు అని అనుకునే తరుణంలో, ప్రశాంత్ సలార్ సినిమాతో ఒక హిట్ అందించాడు. ఈ సినిమా మళ్లీ కోట్లు కొల్లగొట్టింది.

Kiara Advani

ఎన్టీఆర్ తో సినిమా

ప్రస్తుతం ప్రశాంత్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ 31 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు కావాల్సింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఒక వార్త బయట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే కియారా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ అప్డేట్ ను అధికారికంగా త్వరలో ప్రకటించినట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు