Prabhas – Ntr Movie : ప్రభాస్ – ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ మూవీ.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Prabhas – Ntr Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు వస్తూనే ఉంటాయి. ఒకవైపు రీమేక్ సినిమాలు, మరోవైపు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ రావడం కామన్.. రీమేక్ సినిమాలు కాస్త నిరాశ పరుస్తుంటాయి. కానీ మల్టీ స్టారర్ సినిమాలు మాత్రం మంచి టాక్ ను అందుకుంటున్నాయి. గతంలో వచ్చిన బాహుబలి ( Bahubali ) , త్రిపుల్ ఆర్ ( RRR )వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే విదేశాల్లో కూడా హవాను కొనసాగించాయి. అయితే ఇప్పుడు మరో మల్టీ స్టారర్ సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీని ఊపేస్తుంది. ఏ హీరోలతో సినిమా రాబోతుంది.. డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మల్టీ స్టారర్ సినిమాలకు పెట్టింది పేరు రాజమౌళి ( Rajamouli ) . ఈయన ఇప్పటికి వరకు చేసిన పెద్ద సినిమాల్లో ఎక్కువగా స్టార్ హీరోలతోనే చేశారు. గతంలో వచ్చిన సినిమాలు ఒక లెక్క బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ పెరిగింది. బాహుబలి సిరీస్ లతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. అలాగే త్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ ను అందుకున్నాడు. రామ్ చరణ్( Ram Charan ), ఎన్టీఆర్ (Ntr) కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఆ సినిమాను జపాన్ లో కూడా ఇటీవల రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి స్పందన వచ్చింది.. ఇప్పుడు జక్కన్న ప్రభాస్, ఎన్టీఆర్ లతో ఒక సినిమా తీస్తే బాగుండు అని ఫ్యాన్స్ కోరుతున్నారు..

ప్రభాస్ – ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మూవీ..

NTR and Prabhas combo multi starrer movie
NTR and Prabhas combo multi starrer movie

పాన్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తే బాగుండునని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నాడు.. డార్లింగ్ రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్ సినిమాలతో ఆడియన్స్ ను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చెయ్యనున్నాడు.. ఈ సినిమాలన్ని అయ్యేలోగా మరో రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి..

- Advertisement -

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల కాంబోలో దేవర సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో వార్ 2, ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇవన్నీ అయ్యాక ఆ సినిమా గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు