NTR – Anushka: ఇప్పటివరకు ఈ కాంబో తెరకెక్కకపోవడానికి కారణం..?

NTR – Anushka.. సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్లు తెరపై మంచి విజయాన్ని అందుకుంటే మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తూ సినిమాలు తీస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. మరికొన్ని కాంబినేషన్లు ఊహించని విధంగా తెరపైకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని కాంబినేషన్లు చూద్దామంటే కూడా తెరపై కనిపించరు. వారిద్దరూ విడివిడిగా సూపర్ స్టార్ లే అయినా వారిద్దరిని కలిపి సినిమా తీసిన దాఖలాలు లేవు. అలాంటి కాంబినేషన్లలో ఎన్టీఆర్ – అనుష్క జంట కూడా ఒకటి. ఈ కాంబినేషన్లో సినిమా చూడాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నా , అందరికీ నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.

NTR - Anushka: The reason why this combo has not been screened so far..?
NTR – Anushka: The reason why this combo has not been screened so far..?

మూడో వ్యక్తి వల్లే సెలబ్రిటీల మధ్య గొడవలు..

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అందరూ అనుకుంటారు. నిజమే నేటి తరం సెలబ్రిటీలలో అందరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఎంత సాన్నిహిత్యం ఉన్నా కూడా మూడవ వ్యక్తి కారణంగా కొంతమంది సెలబ్రిటీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. అలాంటి కోల్డ్ వార్ ఎన్టీఆర్ – అనుష్క మధ్య కూడా జరిగిందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఎన్టీఆర్ సౌత్ లో ఉండే స్టార్ హీరోయిన్స్ అందరితో కూడా సినిమాలు చేశారు ఒక అనుష్క తప్ప.

అనుష్క వెంకటేష్ మూవీ లో గెస్ట్ గా ఎన్టీఆర్..

ఇక అనుష్క – వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన చింతకాయల రవి సినిమాలో ఒక పార్టీ సాంగ్ లో మాత్రమే ఎన్టీఆర్ గెస్ట్ గా కనిపిస్తాడు. ఆ ఒక్క పాటలో వీరు ముగ్గురు కలిసి డాన్స్ వేశారు అంతే.. ఆ తర్వాత ఎన్టీఆర్ – అనుష్క కాంబినేషన్ పూర్తిస్థాయిలో తెరపై కనిపించలేదు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

అనుష్క పై నిర్మాత చాడీలు..

నిజానికి ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబినేషన్లో వచ్చిన శక్తి సినిమాలో హీరోయిన్ గా ముందుగా అనుష్కని అనుకున్నారు. కానీ అనుష్క గురించి జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీకి చెందిన ఒక టాప్ సీనియర్ నిర్మాత లేనిపోని రూమర్స్ చెప్పారట. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమా అప్పటికే రూ.32 కోట్లు షేర్ రాబట్టింది. ఆ స్థాయి వసూళ్ళు ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఎవరికీ రాలేదని, అందుకే అనుష్క వేరే హీరో సినిమాలో హీరోయిన్ రోల్ చేయాల్సి వస్తే , హీరో కంటే ఎక్కువ పారితోషకం డిమాండ్ చేస్తుందని, ఆమెకి ఇగో ఎక్కువ అని లేనిపోని చాడీలు చెప్పారట. ఇక చాడీలు నమ్మిన ఎన్టీఆర్ మెహర్ రమేష్ కి ఫోన్ చేసి అనుష్కకి బదులుగా ఇలియానా తీసుకోమని సలహా ఇచ్చారట.

అందుకే ఎన్టీఆర్ – అనుష్క కాంబినేషన్లో సినిమా రాలేదు..

కానీ మెహర్ రమేష్ అప్పటికే అనుష్క ఈ సినిమాలో నటింప చేయడానికి ఆమెను ఒప్పించి డేట్స్ కూడా అడ్జస్ట్ చేశారట. కానీ ఎన్టీఆర్ సడన్ అలా చెప్పేసరికి ఆమెకు ఫోన్ చేసి సినిమా నుంచి తప్పించారు. పాపం ఒక నిర్మాత వల్ల అనుష్క ఒక పెద్ద ఆఫర్ ని కోల్పోయింది. అంతేకాదు ఎన్టీఆర్ సినిమా కోసం తన సినిమాలను కూడా పక్కన పెట్టిన అనుష్క చివరికి తనను తప్పించి ఇంకో అమ్మాయిని తీసుకోవడంతో పూర్తిస్థాయిలో హర్ట్ అయ్యిందట. ఇక అందుకే అప్పటినుంచి ఎన్టీఆర్ సినిమాలో ఈమె నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఆ సీనియర్ నిర్మాత ఎవరు అనే విషయం ఇంకా తెరపైకి రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు