NTR30 : పూజా కార్యక్రమానికి మెగాస్టార్ ..?

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ తన నట విశ్వరూపం చూపించాడు. ఈ చిత్రం గ్లోబల్ హిట్ కావటం, అంతర్జాతీయ ప్రశంసలు అందుకోవటం ఎన్టీఆర్ సినీ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేలా చేసింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా లో తారక్ యాక్షన్, అప్పీరెన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది.

అప్పటి నుంచి తారక్ పై ప్రేక్షకులకు అంచనాలు భారీగా పెరిగాయి. దానితో తన నెక్స్ట్ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తారక్ తన కెరీర్ లో 30వ సినిమాను ఆచార్య సినిమా ముందు వరకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 2022 లో కొరటాల శివ తో తన నెక్స్ట్ సినిమాను సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసాడు. అంతే కాదు.. ఓ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

సినిమా అనౌన్స్ వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ గురించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్30 షూట్ స్టార్ట్ చేయటానికి ముహూర్తం ఫిబ్రవరి 2వ వారంలో హైదరాబాద్ లో జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు