Ntr31: ఎన్టీఆర్ తో జతకట్టినున్న రామ్ చరణ్ హీరోయిన్

Ntr31: ప్రస్తుతం ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న సినిమాలలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమా ఒకటి. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది అయితే ఈ సినిమా హిట్ అవ్వడం అనేది ఎన్టీఆర్ కంటే కొరటాల శివకు కీలకమని చెప్పాలి. ఎందుకంటే వరుసగా బ్లాక్బస్టర్ హిట్లు అందుకున్న శివ ఆచార్య సినిమాతో ఒక డిజాస్టర్ ను మూట కట్టుకున్నాడు. అప్పుడు కొరటాల శివ ను పొగిడిన చాలామంది తిట్టడం కూడా మొదలుపెట్టారు.

 

ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వస్తే టెంపర్ సినిమా తర్వాత ఫెయిల్యూర్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి మంచి హిట్లు అందుకుంటున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫెయిల్ అయినప్పుడు బాబి తో సినిమా చేసి జై లవకుశ హిట్ అందుకున్నాడు. వరుస డిజాస్టర్ లో ఉన్న పూరి జగన్నాథ్ తో సినిమా చేసి టెంపర్ సినిమాతో మంచి హిట్ ఎందుకు ఉన్నాడు. ఇక అజ్ఞాతవాసి సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసి అరవింద సమేత వీర రాఘవ రూపంలో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు అలానే కొరటాల శివతో చేస్తున్న సినిమాతో కూడా హిట్టందుకుంటాడని చాలామంది అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది.

- Advertisement -

Alia Bhatt

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాను చేయనున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి ఎప్పటినుంచో ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. దేవర సినిమా షూటింగ్ అయిపోగానే ఈ సినిమా షూటింగ్లో పాల్గొని ఉన్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా నటించింది ఆలియా. సీత పాత్రలో కనిపించి మంచి పేరును సాధించుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ఆలియా నటిస్తుంది అని వస్తున్న కథనాలకు అధికార ప్రతి ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు