Operation Valentine : సోసో సినిమానే… వీళ్ళు ఇచ్చిన బిల్డప్ అంతా ఉత్తిదే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కొన్ని హిట్ అయినప్పటికీ, అవి ఆయన కెరీర్ కు ఏ మాత్రం హెల్ప్ చేయలేకపోయాయి. ఆ హిట్ సినిమాల క్రెడిట్ ఆయనకు దక్కకపోవడమే దానికి మెయిన్ రీజన్. కానీ కంచె, అంతరిక్షం లాంటి ఫ్లాఫ్ సినిమాలే వరుణ్ టాలెంట్ ను బయట పెట్టాయి. దీంతో అదే బాటలో ఇప్పటిదాకా పలు ప్రయోగాత్మక సినిమాలు చేసి వరుస ఫ్లాఫ్స్ అందుకున్న వరుణ్ “ఆపరేషన్ వాలెంటైన్”పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో నైనా హిట్ కొట్టాలనే కసితో ప్రమోషన్స్ విషయంలో గట్టిగానే కష్టపడ్డాడు. కానీ తాజాగా సినిమాను చూసిన వారంతా ప్రమోషన్స్ లో వీళ్ళు ఇచ్చిన బిల్డప్ అంతా ఉత్తిదేనని, ఈసారి కూడా వరుణ్ కు హిట్ కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.

దేశభక్తి, ఎమోషన్స్ హైలెట్ అన్నారు… కానీ…
“ఆపరేషన్ వాలెంటైన్” పలు వాయిదాల అనంతరం మూవీ మార్చ్ 1న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే సినిమా ప్రమోషన్లలో వరుణ్ తేజ్ చేసిన ఆసక్తికర కామెంట్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. పుల్వామా దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి అంశంతో తెరకెక్కుతున్న మొదటి తెలుగు మూవీ ఇదే కావడంతో బజ్ కూడా బాగానే ఉంది. కానీ ఇప్పటికీ ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన “యురి : ది సర్జికల్ స్ట్రైక్”, “ఫైటర్” సినిమాలతో పోలిస్తే “ఆపరేషన్ వాలెంటైన్”లో ఉన్న ప్రత్యేకత ఏంటి? అని వరుణ్ కు ప్రమోషన్స్ లో ఓ ప్రశ్న ఎదురైంది. అయితే వరుణ్ ఏమాత్రం తడుముకోకుండా ఈ సినిమాలో దేశభక్తి గురించి గొప్పగా వివరించామని, ఎమోషన్స్ చాలా బాగుంటాయని చెప్పాడు. అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అసలు సినిమాతో అలాంటి కనెక్టివిటీ ఏమి ఉండదు. ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్లస్ కంటే మైనస్ లే ఎక్కువగా ఉన్నాయి.

వరుణ్ అంచనాలు తలకిందులు…
వరుణ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తీరు చూస్తే ఆయన ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు ఏంటో అర్థమవుతుంది. కానీ బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఆయన అంచనాలను తలకిందులు చేసేసాడు. ఫ్లాట్ నరేషన్ తో ఫస్టాఫ్ అంతా బోర్ కొట్టేలా చేశాడు. అలాగే డైరెక్టర్ శక్తి దర్శకత్వ తీరు ఏమాత్రం ఆకట్టుకోదు. కథ సంగతి పక్కన పెడితే ఆయన వరుణ్ తో సహా నవదీప్, అలీ రెజా, అభినవ్ గోమటం వంటి మంచి నటులు ఉన్నప్పటికీ, వాళ్ళ టాలెంట్ ను సరిగ్గా వాడుకోలేదు. సినిమా రిలీజ్ కి ముందు 50 కోట్ల తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి అని హోరెత్తించారు. కానీ థియేటర్లో చూశాక వీఎఫ్ఎక్స్ పరంగా కూడా సాదా సీదాగానే అనిపించడం ఖాయం. ఇక లాస్ట్ హోప్ హీరోయిన్… ఆమె గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీసం నటిగా కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది మానుషి. ఇలా సోసోగా ఉన్న ఈ సినిమాను విజువల్ వండర్ అంటూ బిల్డప్ ఇచ్చారు. కానీ తీరా చూస్తే వీళ్ళు హైప్ ఇచ్చినంతగా ఏం లేదు మూవీలో. అంతా ఉత్తినే…!! మొత్తానికి పాపం వరుణ్ కు ఈసారి కూడా హిట్ కష్టమే అనిపించేలా చేశారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు