Geetha Govindham Sequel : మళ్ళీ ‘గీత’ వద్దకే చేరిన పరశురామ్… గీతా గోవిందం సీక్వెల్ రెడీ

Geetha Govindham 2 :యువత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పరశురామ్. అయితే ఈ సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా చేసిన సోలో సినిమా పరశురామ్ కి అద్భుతమైన పేరును తీసుకొచ్చింది. ఇకపోతే పరశురామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా వస్తుంది అని అప్పట్లో చాలా కథనాలు వినిపించాయి. కానీ వాటికి భిన్నంగా అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాను చేశాడు పరశురామ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.

 Geetha Govindam

గీత గోవిందం సినిమాతో బ్రేక్

పరశురామ్ ఒక దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నా కూడా, పరశురామ్ కి ఒక బ్రేక్ తీసుకొచ్చిన సినిమా అయితే మాత్రం గీతగోవిందం అని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పటికే విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. అయితే యూత్ కి బాగా దగ్గరైన విజయ్ ని మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా ఈ గీతగోవిందం. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమా తర్వాత పరశురామ్ నాగచైతన్యతో సినిమా చేస్తాడు అని కథనాలు వినిపించాయి.

- Advertisement -

నాగచైతన్య నేను పక్కనపెట్టి మహేష్ బాబుతో

నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో మహేష్ బాబుకి కథ చెప్పే అవకాశం దొరికింది. అయితే పరశురామ్ మహేష్ బాబుకి చెప్పిన కథ బాగా నచ్చడం వలన ఈ కథను వెంటనే సినిమాగా చేసేద్దామని ఇద్దరు రెడీ అయ్యారు. అయితే నాగ చైతన్య పర్మిషన్ తీసుకొని మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. మహేష్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో బయటికి తీసాడు పరశురామ్ అని ప్రశంసలు కూడా వచ్చాయి.

దిల్ రాజు ప్రొడక్షన్లో ఎంట్రీ

నాగచైతన్యత పరశురామ్ సినిమా మళ్లీ ఉంటుంది అని అందరూ అనుకున్న తరుణంలో వారిద్దరికీ కొన్ని డిఫరెన్సెస్ రావటం వలన ఆ సినిమా కాస్త ఆగిపోయింది. అయితే ఇంతకుముందు సూపర్ హిట్ సినిమా గీత గోవిందంకి సీక్వెల్ గా గీత ఆర్ట్స్ లోనే సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే అక్కడ కూడా సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత దిల్ రోజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పరశురామ్. అయితే ఈ బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆడలేదు.

Ga2 లో గీత గోవిందం సీక్వెల్

ఇకపోతే ఎప్పటినుంచో అనుకుంటున్నా గీత గోవిందం సినిమాకి సీక్వెల్ సిద్ధం కానుంది. అయితే అది కూడా గీత ఆర్ట్స్ 2 లో రానున్నట్లు సమాచారం. ఈ సినిమాని నవంబర్ లో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు అని చెప్పాలి.  ఈ సినిమాకి సంబంధించిన అధికారికి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. మరోవైపు పరశురాం రామ్ పోతినేని తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు