Parineeti Chopra: రాజ్యసభ ఎంపీతో బాలీవుడ్ హీరోయిన్ డేటింగ్

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా.. 2011 లో “లేడీస్ వర్సెస్ రిక్కీబెల్” అనే మూవీ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అక్క ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్ అయినా.. తన సొంత టాలెంట్ తో ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుకుంది. ఈమె కెరీర్ ప్రారంభమై ఇప్పటికి దశాబ్దం అవుతున్నప్పటికీ తన అక్క తరహాలో మాత్రం ఆకట్టుకోలేక పోతోంది. అర్జున్ కపూర్ సరసన నటించిన “ఇషక్ జాదే” సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

ప్రస్తుతం పరిణితి నటించిన చమ్కీలా, క్యాప్సుల్ గిల్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తో పరిణితి చోప్రా డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

దీనికి గల కారణం ఏమిటంటే.. బుధవారం ముంబైలోని ఓ రెస్టారెంట్ లో వీరిద్దరూ కలసి డిన్నర్ చేస్తూ మీడియా కంటపడ్డారు. ఆ తర్వాత గురువారం రోజు ఓ ఈవెంట్ లో పాల్గొన్న వీరిద్దరూ.. ఒకే కారులో వెళ్లిపోయారు. దీంతో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తో పరిణితి చోప్రా డేటింగ్ లో ఉన్నది నిజమేనంటూ ప్రచారం మొదలైంది. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. బాలీవుడ్ హీరోయిన్ ఓ పొలిటీషియన్ తో రెస్టారెంట్స్ కి తిరుగుతూ ఉండడంతో అభిమానులు, జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు