Pavitra Gowda : పవిత్ర జైల్లో వుంది.. కానీ ప్రెగ్నెంట్.. ఇదెక్కడి విడ్డూరం భయ్యా..?

Pavitra Gowda.. సీరియల్ నటి పవిత్ర గౌడ గురించి బుల్లితెర ఆడియన్స్ కి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇకపోతే సీరియల్స్ చూసే వారికి మాత్రమే ఈమె గురించి బాగా తెలుసు.. కానీ ఇప్పుడు పవిత్ర గౌడ అంటే అందరికీ పరిచయం అయిపోయింది.. దీనికి కారణం ప్రముఖ హీరో దర్శన్ ఈమె కోసం చేసిన అత్యంత దారుణమైన పని అని చెప్పడంలో సందేహం లేదు.. హీరో దర్శన్ కు భార్య, పిల్లలు ఉన్నారు.. కానీ వారిని కాదని.. అప్పటికే పెళ్లయి ఒక కూతురుకి జన్మనిచ్చిన పవిత్ర గౌడతో దర్శన్ ఎఫైర్ పెట్టుకున్నారు అయితే ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచకపోగా.. ఈ సంబంధానికి 11 ఏళ్లు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేసింది. ఈ విషయాన్ని సహించలేకపోయిన ఒక అభిమాని.. ఈమెను పూర్తిస్థాయిలో ట్రోల్ చేశారు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న పవిత్ర.. ఏకంగా దర్శన్ తో ఆ అభిమానిని హత్య చేయించింది.

Pavitra Gowda: Pavitra is in jail.. but pregnant.. where is the irony?
Pavitra Gowda: Pavitra is in jail.. but pregnant.. where is the irony?

జైల్లో ఉన్న పవిత్ర ప్రెగ్నెంట్..

తన అభిమాని అయిన 28 ఏళ్ల రేణుక స్వామిని దర్శన్ ఏకంగా రూ.30 లక్షల సుఫారీ ఇచ్చి మరీ చంపించడం ఇంతకంటే దారుణం మరొకటి లేదేమో. ఈ కేసులో పవిత్ర గౌడను పోలీసులు A 1 ముద్దాయి గా చేర్చగా.. A2 ముద్దాయిగా దర్శన్ ను చేర్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఈ కేసులో భాగంగా జైల్లో ఉంటున్నారు. రేణుక స్వామి హత్య కేసులో వీరిద్దరిని జూన్ 10వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పవిత్ర గౌడ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పవిత్ర గౌడ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె గర్భవతి అని.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ రూమర్స్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నాయి.. ముఖ్యంగా కన్నడ మీడియాలో ఈ వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజెన్స్.. జైల్లో ఉన్న పవిత్ర గర్భవతి కావడం ఏంటి..? అక్కడ కూడా కొంపతీసి ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

రూమర్స్ ను ఖండిస్తున్న దర్శన్ సన్నిహితులు..

అయితే ఈ విషయంపై దర్శన్ సన్నిహితులు స్పందించి.. అలాంటిదేమీ లేదు.. ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే అంటూ ఖండిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఇటీవల పవిత్ర గౌడ అస్వస్థకు గురవడంతో పోలీసు సిబ్బంది ఆమెను గాంధీ నగర్ లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దాంతో పవిత్ర గౌడ ప్రెగ్నెంట్ అనే వార్తలు మరింత జోరు అందుకున్నాయి. పవిత్ర గౌడ నిజంగానే ప్రెగ్నెంట్ అని, అందుకే హాస్పిటల్ కి వెళ్ళింది అంటూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని, ఆమెకు అస్వస్థత కారణంగానే హాస్పిటల్ కు తీసుకెళ్లారని, దయచేసి దుష్ప్రచారం చేయడం ఆపేయండి అంటూ కోరుతున్నారు. మొత్తానికి అయితే పవిత్ర గౌడ పై వస్తున్న ఈ రూమర్స్ ఎప్పుడు ఆగిపోతాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు