Mahesh Babu: అటు పవన్ ఫ్యాన్స్, ఇటు మహేష్ ఫ్యాన్స్ – మధ్యలో త్రివిక్రమ్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మెగాఫోన్ పక్కనపెట్టి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ మే 31న రివీల్ అవనుండగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుండి థమన్ తప్పుకున్నాడంటూ రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి మహేష్ సినిమాను నిర్లక్ష్యం చేస్తున్నాడని అంటున్నారు.
మే 31న థియేటర్లలో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని అనౌన్స్ చేసిన పోస్టర్లో థమన్ పేరు లేకపోవటం కూడా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి బలం చేకూర్చుతోంది. టీజర్ కి బీజీఎమ్ కూడా 26వరకు ఫైనలైజ్ చేయలేదని సమాచారం అందటంతో టీజర్ రిలీజ్ పై సందిగ్దత నెలకొంది. దీంతో త్రివిక్రమ్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా త్రివిక్రమ్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ఒక్క సినిమాకు కూడా 30,40రోజులకు మించి డేట్స్ కేటాయించకపోవటం పైగా చాలా కాలం కిందట మొదలైన హరిహర వీరమల్లు సినిమాను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ తో వరుసగా రీమేక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్, మహేష్ ఫ్యాన్స్ ని త్రివిక్రమ్ ఎలా సంతృప్తి పరుస్తారా అన్న ఆసక్తి నెలకొంది.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు