Allu Arjun: నేషనల్ అవార్డు వచ్చిన టైం లో పవన్ అవమానించాడు… బన్నీ ఇన్నింటినీ భరించాడా..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు రోజు వార్తల్లో వినిపిస్తుంది. పుష్ప 2 పోస్ట్ పోన్ అయిందనే వార్తలు రోజు రోజుకు ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు మెగా ఫ్యామిలీతో గొడవలు.. సోషల్ మీడియాలో అల్లు, మెగా ఫ్యామిలీతో గొడవలు గురించి వార్తలు రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో బన్నీ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన టైం లో పవన్ అవమానించాడనే వార్త చక్కర్లు కొడుతుంది..

అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటుగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ టైం లో సినీ , రాజకీయ ప్రముఖులు అభిమానులు అందరు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎదో నామమాత్రంగానే ట్వీట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.. అది పవన్ బన్నీని అవమానించాడని అల్లు ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత బన్నీ మేడమ్ టుస్సాడ్ లో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా పవన్ కానీ , మెగా ఫ్యామిలీ కానీ స్పందించలేదు.. మొత్తంగా చూసుకుంటే బన్నీ మెగా ఫ్యామిలీ వల్ల చాలా భరించినట్లు ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. అవన్నీ గుర్తుకు రావడం వల్లే బన్నీ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని టాక్..

Pawan insulted Bunny at the time when he got the National Award... Is that why he got away from Mega Family?
Pawan insulted Bunny at the time when he got the National Award… Is that why he got away from Mega Family?

ఇక ప్రస్తుతం మెగా , అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నట్లు రోజూ వార్తలు హైలెట్ అవుతుంటాయి. వైసిపికి సపోర్ట్ చేస్తూ బన్నీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడం వల్లే గొడవలు మొదలయ్యాయని తెలుస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా అల్లు ఫ్యామిలీ కనిపించలేదు.. దాంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.. ఇదిలా ఉండగా మెగా , అల్లు ఫ్యామిలీ మధ్య వస్తున్న గొడవల పై నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు.. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ ఆయ్‌ ‘ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థీమ్ సాంగ్ లాంచ్ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఫ్యామిలిలో చిన్న గొడవలు రావడం కామన్.. మళ్లీ కలిసిపోవడం కామన్. వీటిని పట్టించుకోని పెద్దగా చెయ్యడం తప్పే అవుతుందని ఆయన అన్నాడు..

- Advertisement -

అంతేకాదు.. కుటుంబం ఎప్పుడూ కలిసుండాలని చిరంజీవి ఎప్పుడూ తాపత్రయపడుతుంటారని, ప్రతి ఏడాది కుటుంబం మొత్తాన్ని బెంగళూరుకు తీసుకెళ్లి సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేస్తారని గుర్తుచేశారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదే అయినా ఫ్యామిలీ అంతా కలిసుండాలన్నదే చిరంజీవి అభిమతమని బన్నీ వాసు తెలిపారు. అలాగే త్రివిక్రమ్ , బన్నీ సినిమా పై అదిరిపోయే అప్డేట్ కూడా ఇచ్చాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు