Mr Bachchan : మూవీ రిలీజ్ కు ముందు పవన్ తో హరిష్ శంకర్ పెద్ద ప్లానే వేశాడు… కానీ ఆ ఛాన్స్ ఉందంటారా?

Mr Bacchan : టాలీవుడ్ లో ఆగష్టు 15న రాబోతున్న క్రేజీ సినిమాల్లో ‘మిస్టర్ బచ్చన్’ కూడా ఒకటి. ఆరోజు పెద్దా, చిన్నా కలిపి ఐదు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే రిలీజ్ కి వారం రోజులే సమయం ఉండగా, చిత్ర యూనిట్ కూడా నాన్ స్టాప్ గా భారీగా ప్రమోషన్లు చేస్తూ, సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఆల్రెడీ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి బజ్ ని తీసుకురాగా, లేటెస్ట్ గా మాస్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేసారు. ట్రైలర్ కట్ కూడా బాగానే ఉండి ఆకట్టుకుంటుంది. ఇక చిత్ర యూనిట్ కూడా వరుస ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు చేస్తూ సినిమా కోసం అంచనాలు పెంచే పనిలో ఉన్నారు. కానీ ఇంకా ఏదో హై కావాలి. అందుకే ఈ సారి పవర్ స్టార్ నే రంగంలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్.

Pawan Kalyan as the guest of Mr Bachchan movie pre release event

పవన్ తో పెద్ద ప్లానే వేసిన హరీష్ శంకర్…

అయితే మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించి అన్ని రకాల ప్రమోషన్లు చేసినా, పంద్రాగస్టున భారీగా పోటీ ఉన్న నేపథ్యంలో సినిమాకి ఇంకేదో హై కావాలి. అందుకే ఈసారి పవన్ నే రంగంలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. ఇక హరీష్ శంకర్ తో, అలాగే రవితేజ తో పవన్ కళ్యాణ్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. అందుకే పవన్ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ని మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలవడానికి ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్. హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా పిలిచి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

- Advertisement -

ఈ టైం లో ఛాన్స్ ఉందంటారా?

ఇక గతంలోనూ పవన్ కళ్యాణ్ రవితేజ నటించిన “నేల టిక్కెట్టు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్లాప్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి రవితేజ కోసం పవన్ కళ్యాణ్ ని దించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న రాజకీయ బిజీ లో రావడానికి వీలవుతుందా అనేది ప్రశ్న. నిన్ననే కర్ణాటకలో సీఎం ని మీట్ అయిన పవన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీని పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గనుక ఒక్క గంట ప్రీ రిలీజ్ కి సమయం కేటాయిస్తే… మళ్ళీ పవన్ కళ్యాణ్ – రవితేజ ని ఒకే వేదికపై స్క్రీన్ పై చూస్తే ఆ కిక్కే వేరని చెప్పాలి. అభిమానులకు అంతకు మించిన ఖుషి ఉండదు. మరి రెండోసారి ఈ స్టార్స్ కలయిక సాధ్యం అవుతుందా లేదా… ఆ ఛాన్స్ ఉందొ లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు