Pawan Kalyan Reentry : ఎలక్షన్స్ పూర్తి… సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ ఎప్పుడంటే?

Pawan Kalyan Reentry : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులతో పాటు పలువురు యంగ్ డైరెక్టర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆయన రాజకీయాల కోసం సినిమాలను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ పూర్తయ్యాయి. మరి పవర్ స్టార్ సినిమాల్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారు? అనే వివరాల్లోకి వెళ్తే…

పవన్ కోసం యంగ్ డైరెక్టర్స్ పడిగాపులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫీవర్‌కి తెరపడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడు బ్రేక్‌ దొరికింది. మే 13 న జరగనున్న ఎన్నికల కోసమే ఆయన చాలా రోజులు సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయన కోసం క్యూలో ఉన్నారు హరీష్ శంకర్, సుజీత్, క్రిష్ లాంటి యంగ్ డైరెక్టర్స్ అంతా. ఆయన రాజీకియాలు ముగించుకుని వస్తే షూటింగ్ స్టార్ట్ చేసి, ఆయన ప్రాజెక్టును ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.

ఫ్యామిలీతో పవన్ ట్రిప్

పవన్ గత ఆరు నెలల నుంచి ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు. తాజాగా ఏపీలో ముగిసిన ఎలెక్షన్స్ నేపథ్యంలో మంగళగిరిలో ఓటింగ్ ముగించుకుని పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఆయన ఎప్పుడెప్పుడు మళ్లీ సినిమాలు స్టార్ట్ చేస్తారా? అని వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కానీ పవన్ ఈ నెలలో కొంత విరామం తీసుకొని మేలో తన కుటుంబంతో కొన్ని రోజులు విహారయాత్రకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే ఆయన ఈ ట్రిప్ కోసం ఎక్కడికి వెళ్లనున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

- Advertisement -

జూన్ లో మళ్లీ సెట్స్ పైకి..

పవన్ కళ్యాణ్ జూన్‌లో ఓజీ షూట్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి కాగా, పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. ఈ మూవీతో పాటే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు చిత్రాలకు జూలై, ఆగస్టులో వరుసగా డేట్లు కేటాయించారు.

15 రోజులే షూటింగ్ కి..

ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ తన సినిమా కమిట్‌మెంట్‌ల కోసం నెలలో 15 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో నెలలో మిగిలిన సగం సమయాన్ని రాజకీయాల కోసం స్పెండ్ చేస్తాడని సమాచారం. మరి డైరెక్టర్స్ ఆయన ఇచ్చిన టైమ్ ను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. ఇప్పటికే రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉన్న పవన్ సినిమాలను కూడా కంటిన్యూ చేయనున్నారు. ఈసారి ఎలెక్షన్స్ లో ఆయనకు సినిమా ఇండస్ట్రిలో చాలామంది అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే పవన్ గెలుస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పవన్ కొత్త సినిమాలు

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కూడా సైన్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. వాటిని వచ్చే నెలలో ఫైనల్ చేయనున్నారు. సెప్టెంబర్‌లో ఓజీ మూవీని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆయన నటిస్తున్న మరో రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు