Pawan Kalyan’s Ex-Wife: రేణుదేశాయ్ ఏం చేసినా పవన్ ఫ్యాన్స్ కి నెగిటివ్ గానే కనిపిస్తుందా..?

Pawan Kalyan’s Ex-Wife

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ రేణుదేశాయ్ రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియో ఇటు సోషల్ మిడియాలో అటు ఏపీ రాజకీయాల్లో ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గానే రియాక్ట్ అయినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ పై నెగిటివ్ కామెంట్స్ తో అటాక్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, సొసైటీ కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న వ్యక్తి అని అంటూనే పవన్ కళ్యాణ్ తనను మోసగించిన మాట వాస్తవమే అని కామెంట్ చేసింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ ని పక్కన పెట్టి మోసం చేశాడన్న ఒక్క మాటను పట్టుకొని రేణుని సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ తో డైవర్స్ అయిన రోజు నుండి రేణు టాలీవుడ్ కి దూరంగా ఉంటూ తన లైఫ్ తాను పీస్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. అయినప్పటికీ ఎదో ఒక సిచువేషన్, ఇన్సిడెంట్ ని రేణుకి లింక్ చేస్తూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ వీడియో విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది.

- Advertisement -

రేణు దేశాయ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతున్నా కూడా పవన్ ఫ్యాన్స్ ఆమెని వదలటం లేదు. ‘అందుకే మిమ్మల్ని పవన్ తన్ని తరిమేశాడు మేడం’ అంటూ  ఒక నెటిజన్ చేసిన కామెంట్ కి రేణు ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.’ నన్ను తిట్టడం వల్ల మీకు మనశ్శాంతి వస్తుందని అనుకుంటే మీకు మనశ్శాంతి వచ్చేంతవరకు తిట్టండి’ ఎమోషనల్ అయ్యింది రేణు.రేణు దేశాయ్ పవన్ కి మంచి చేయాలని భావించినా కూడా అది తన మెడకే చుట్టుకుంది పాపం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు