OG Movie : ఓజీ రాజీ పడక తప్పదా.. పవన్ ఇంత మోసం చేస్తాడునుకోలేదు..

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే… ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఏం గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.. పవన్ ఆ భాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు చాలా బిజీగా ఉన్నారు.. సినిమాల గురించి మాట్లాడలేనంత బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.. ఏపీకి సంబందించిన పనుల గురించి చర్చలతో, మీటింగ్ లతో, పర్యటనలతో బిజీగా ఉన్నాడు.. దాంతో ఇప్పుడు సినిమాల ఊసే ఎత్తే పరిస్థితి కనిపించలేదు.. ఈ నేపథ్యంలో పవన్ ఒక్క నెల రోజులు డేట్లు ఇస్తే చాలు షూటింగ్ పూర్తి చేసుకోవడానికి ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు, ఓజిల పరిస్థితి ఇంకొంత కాలం ఇలాగే ఉండేలా కనిపిస్తుంది..

అందులోను ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఓజీ సినిమా విషయంలో తప్పక రాజీ పడక తప్పదు.. ఎందుకంటే సినిమాలో గ్యాంగ్ స్టర్ గా పవన్ కనిపించబోతున్నారు.. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తే మాత్రమే ఏపీ ప్రజలు పవన్ ను నమ్మరనే వాదన వినిపిస్తుంది. ఈ సినిమాను డైరెక్టర్ సుజిత్ ముందుగా రెండు పార్ట్ లు అనుకున్నా కూడా ఇప్పుడు ఒక పార్ట్ విడుదల అవ్వడం కష్టంగా మారిందని తెలుస్తుంది.. గతంలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన టీమ్ ఇప్పుడు వెనక్కి తగ్గేలా కనిపిస్తుంది. ఓజీ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి..

Pawan who left Og .. dieheart fans are feeling
Pawan who left Og .. dieheart fans are feeling

ఓజీ పరిస్థితే ఇలా ఉందంటే మిగిలిన సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి కొంత కాలం మర్చిపోవడం బెటర్. పాలనలో తన అవసరం ఎంత ఉందో గుర్తించిన పవన్ కొత్త సినిమాలకు ఎలాంటి కమిట్ మెంట్లు ఇచ్చే మూడ్ లో ప్రస్తుతానికి లేరని ఆయన సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న మాట.. ఇది విన్న ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు.. రాజకీయాలతో పాటే సినిమాలు కూడా చేస్తానని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించేలా లేదని ఫీల్ అవుతున్నారు.. తమ అభిమాన హీరోను స్క్రీన్ మీద చూసుకోవాలని అనుకున్న కోరిక ఇక తీరదా.. పవన్ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అంటున్నారు.. ఫ్యాన్స్ కోరిక మేరకు స్క్రీన్ మీద కనిపిస్తాడేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు