Payal Rajputh : నాలుగేళ్లుగా తెరకెక్కుతున్న పాయల్ మూవీ..! రిలీజ్ ఎప్పుడు?

Payal Rajputh : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో పాయల్ రాజపుత్ ఒకరు. RX 100 మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, వెంకీ మామ, మంగళవారం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకు పప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో ఈమె ముందుంటుంది. లాస్ట్ ఇయర్ మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో కిరాతక అనే సినిమాలో నటిస్తుండగా, తమిళ్ లో మరో రెండు సినిమాల్లో నటిస్తుంది. అయితే పాయల్ రాజపుత్ ఎప్పుడో నాలుగేళ్ళ కింద మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇంకా రిలీజ్ నోచుకోలేదని చాలా మందికి తెలీదు. పాయల్ రాజపుత్ హీరోయిన్ గా ప్రణదీఫ్ ఠాకూర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా “రక్షణ”. ఈ సినిమా మొదలై నాలుగేళ్లు దాటినా ఇంకా రిలీజ్ కి కష్టాలు పడుతుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజపుత్ ఐపీఎస్ అధికారిగా పాత్రలో కనిపించనుంది. ఇక డైరెక్టర్ గుణశేఖర్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రం ద్వరా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ చేసారు.

నిర్మాణ బాధ్యతలు మార్పు!

అయితే ఈ సినిమాను కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ మొదట నిర్మాణ బాధ్యత వహించగా, బడ్జెట్ పెరగడంతో హరిప్రియ క్రియేషన్స్ వారు యాడ్ అయ్యారు. ఇక ఈ సినిమాకు ముందు ‘5Ws’ అని టైటిల్ పెట్టారు. కానీ ఇప్పుడు రక్షణ అని టైటిల్ చేంజ్ చేసారు. ఇక ఈ సినిమా గురించి ఓ సందర్భంలో పాయల్ మాట్లాడుతూ, తన కెరియర్‌కి కంప్లీట్‌గా కొత్త సినిమా ఇది అని, పోలీస్, ఐపీఎస్ రోల్ చేయాలని ప్రతి యాక్టర్ కలలు కంటారు. ఫైనల్లీ… అటువంటి గోల్డెన్ ఛాన్స్ తనకు వచ్చిందని, తన నటనపై నమ్మకం, విశ్వాసం ఉంచిన ప్రణదీప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఐపీఎస్ రోల్ చేయడం ఛాలెంజింగ్. తాను బాగా చేశానని అనుకుంటునాన్నని అంది. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి మాత్రం నానా తంటాలు పడుతూ వస్తుంది.

- Advertisement -

 

రిలీజ్ డేట్ ఎప్పుడు?

అయితే పాయల్ (Payal Rajputh) దీని తర్వాత నటించిన దాదాపు అరడజను చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఇంకా రిలీజ్ డేట్ కి నోచుకోలేదు. ఫైనాన్షియల్ సమస్యల వల్లే సినిమా ఆలస్యమైందని తెలుస్తూనే ఉంది. అందుకే నిర్మాత చేంజ్ అవ్వగా, ఈ సినిమా టైటిల్ కూడా చేంజ్ చేసారు. ఇక పాయల్ రాజపుత్ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయగా, మంచి స్పందన రాబట్టుకుంది. అయితే అందులో రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు ఎదురుచుస్తున్నారు. ఇటు ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ సీజన్ లో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి, కాబట్టి ఇలాంటి సమయంలో వస్తే పోటీ లేకుండా ఉంటుంది, కాబట్టి ఇదే మంచి అవకాశం అని అంటున్నారు. మరి మేకర్స్ ప్లాన్ ఎలా ఉందొ.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు