Payal Rajputh : పాయల్ ని ఎవరూ పట్టించుకోలేదేంటి!

Payal Rajputh : టాలీవుడ్ లో ఈ వారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. వాటిలో శర్వానంద్ హీరోగా నటించిన “మనమే” సినిమా, అలాగే కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ గా నటించిన సత్యభామ సినిమా, దాంతో పాటు నవదీప్ చాలా రోజుల తర్వాత హీరోగా నటించిన లవ్ మౌళి, సినిమాలు రిలీజ్ కాగా, వీటితో పాటు పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన “రక్షణ” సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది. అయితే వీటిలో శర్వానంద్ మనమే సినిమాకు మిశ్రమ స్పందన రాగా, థియేటర్లలో టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సత్యభామకు కూడా మిశ్రమ స్పందన రాగా, ఓపెనింగ్స్ మాత్రం అంతంత మాత్రమే వస్తున్నాయి. ఇక నవదీప్ నటించిన లవ్ మౌళి సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ రాగా, థియేటర్లలో కూడా ఆకట్టుకునేలా జనాలు రాలేదు. దాంతో వీకెండ్ లో సినిమాని తీసేయడం కంఫర్మ్ గా ఉంది. అయితే పాయల్ రాజ్ పుత్ (Payal Rajputh) మెయిన్ లీడ్ గా నటించిన “రక్షణ” సినిమా వచ్చిందని చాలా మందికి తెలీదు.

Payal Rajputh starrer Rakshana received flop talk

అసలు వచ్చిందని కూడా తెలీదు..

ఇక పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటించిన రక్షణ సినిమా జూన్ 7న రిలీజ్ అయింది. ఈ విషయం చాలా మందికి తెలీదు. పైగా సినిమాకు కూడా ప్లాప్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా పాయల్ రాజ్ పుత్ తో దర్శక నిర్మాతలకు వచ్చిన విభేదాల కారణంగా కొన్ని రోజుల కింద న్యూస్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ వివాదాలు, సమస్యలు పరిష్కరించుకుని జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమాని మాత్రం అసలు జనాలు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇక సినిమా విడుదల చుట్టూ ఉన్న వివాదాలు మరియు పాయల్ రాజపుత్ నుండి సినిమాకు ప్రమోషన్ లేకపోవడం వల్ల, సినిమాని కూడా ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.

- Advertisement -

ఇక సినిమా కథ విషయానికి వస్తే..

కిరణ్ (పాయల్ రాజ్‌పుత్) ఒక IPS ట్రైనీ, అతని ప్రియమైన స్నేహితురాలు ప్రియ ఆత్మహత్య చేసుకుంది. కానీ కిరణ్ అది హత్య అని నమ్ముతుంది. అయితే, ఆమె తన స్నేహితురాలి మరణం ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని నిరూపించడానికి ఆధారాలు కనుగొనడంలో విఫలమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత, కిరణ్ ACP గా బాధ్యతలు స్వీకరిస్తుంది, మరియు ఆమె అరుణ్ అనే దొంగను చూసి అతనికి గుణపాఠం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అరుణ్ క్యారెక్టర్ అసాసిషన్ చేసి కిరణ్‌కి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే కిరణ్ మాత్రం ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఈవ్ టీజర్ లాంటి వ్యక్తి అని స్టడీ చేస్తూనే ఉండగా, ఒక రోజు అరుణ్ ఆత్మహత్య చేసుకుంటాడు. మరియు కిరణ్ స్టోకర్ మరణం వెనుక ఎవరో ఉన్నారని నమ్మడం ప్రారంభిస్తుంది. అక్కడితో కేసు ఎలాంటి మలుపులు తిరిగింది. కిరణ్ తన సమస్యల నుండి బయటపడిందా లేదా అనేది తెలియాలి.

ఇక రక్షణ సినిమాపై నిర్మాతలు దాదాపు 5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని సమాచారం. కాని కొన్ని తప్పుడు నిర్ణయాలు వారి డబ్బు వృధా కావడానికి కారణం అయ్యాయి. ఇక ఈ సినిమా నాలుగేళ్ళ కింద తెరకెక్కగా, అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేసుకుని ఇప్పుడు రిలీజ్ కాగా, ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ సినిమా గురించి పాయల్ రాజ్ పుత్ కూడా పట్టించుకోవడం లేదు. ఇక రిలీజ్ తరవాత మిగతా సినిమాల వల్ల రక్షణ సినిమా ఆస్దలు జనాలకు తెలియకుండా పోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు