Thandel : పిక్ లీక్… “పుష్ప” లుక్ ను కాపీ కొట్టిన నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ “తండేల్”. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పిక్ లీక్ అయ్యి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ పిక్ చూసిన నెటిజన్లు అంతా నాగచైతన్య “పుష్ప”ను కాపీ కొడుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, లేడీస్ పవర్ స్టార్ సాయి పల్లవి కథానాయకగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”. ఈ సినిమాలో నాగచైతన్య మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు.

- Advertisement -

ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే టైటిల్ తో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమా కోసం నాగచైతన్య పొడవాటి జుట్టు, మందపాటి గడ్డంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కోసం నాగచైతన్య చేయించుకున్న మేక్ ఓవర్ కూడా వార్తల్లో నిలుస్తోంది.

ఇటీవల  “తండేల్”షూటింగ్ స్టార్ట్ కాగా, ప్రస్తుతం కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న మల్వే పోర్ట్ లో లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఎవరు ఊహించని విధంగా నాగచైతన్య ఆన్ లొకేషన్ పిక్ ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో నాగచైతన్య అచ్చం “పుష్ప”రాజ్ లా కనిపిస్తున్నాడు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేక్ ఓవర్ ఎలా ఉందో, ఈ లీకైన పిక్ లో అక్కినేని నాగచైతన్య సైతం డి గ్లామర్ లుక్ లో అలాగే కనిపిస్తున్నాడు. నుదుటిన తిలకం దిద్ది, గుబురు గడ్డంతో, గ్రామీణ యువకుడిలా ఉన్న నాగచైతన్య డి గ్లామర్ లుక్ ను “పుష్ప” నుంచి కాపీ కొట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

లుక్ సంగతి ఎలా ఉన్నా షూటింగ్ స్పాట్స్ నుంచి ఇలాంటి అవాంఛనీయ లీక్ లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చిత్ర యూనిట్ దే. లేదంటే ఇలా వరుసగా లీకులు వస్తే ఆ తర్వాత ఫస్ట్ లుక్ తో ఇప్పటికే పెరిగిన అంచనాలు, టీజర్ పై ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ సినిమాపై ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరి మేకర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని లీక్స్ కాకుండా జాగ్రత్త పడతారా అనేది చూడాలి. మరోవైపు ఈ సినిమా కోసం నటీనటుల తో కలిసి చిత్ర బృందం బాగానే కష్టపడుతోంది. మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి తన టీం తో కలిసి స్పెషల్ వర్క్ చేశారు. సాయి పల్లవి సోమవారం నుంచి సెట్స్ లో జాయిన్ కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు