Polimera 3: పొలిమేర సీక్వెల్స్ పరంపర.. కుంభస్థలమే టార్గెట్..!

Polimera 3:  ప్రస్తుత కాలంలో సీక్వెల్స్ పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా హిట్ కొట్టింది అంటే ఆ సినిమా సీక్వెల్స్ తో అటు దర్శకులు ఇటు హీరోలు తమ మార్కెట్ ను పెంచుకోవడమే కాదు ఆర్థికంగా కూడా బాగా లాభపడుతున్నారు .ఈ క్రమంలోనే 2021లో నేరుగా ఓటీటీ లోకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం మా ఊరి పొలిమేర.. అప్పట్లో ఈ సినిమా చూసేవారి వెన్నులో వణుకు పుట్టించింది. ఇప్పుడు అంతకుమించి సస్పెన్షన్ క్రియేట్ చేస్తూ బ్లాక్ మ్యాజిక్ , హార్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం మా ఊరి పొలిమేర 2. ఇటీవలే థియేటర్స్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా కూడా స్ట్రీమింగ్ అవుతూ బుల్లితెర ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది.

శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరవ గణబాబు సమర్పణలో గౌరీ కృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో సత్యం రాజేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల , గెటప్ శ్రీను రాకెండ్ మౌళి , బాలాదిత్య, చిత్రం శ్రీను, అక్షతా శ్రీనివాస్ ,సాహితీ దాసరి ,రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా భయంకరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పుడు మా ఊరి పొలిమేర 3 కూడా ఉండబోతుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈసారి తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అటు థియేటర్లో ఇటువంటి ఓటీటీ లో మా ఊరి పొలిమేర అలాగే మా ఊరి పొలిమేర 2 చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో ఏకంగా కుంభస్థలాన్ని కొట్టాలని నిర్ణయించుకున్న దర్శకనిర్మాతలు.. మా ఊరి పొలిమేర 3 ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం . మరి ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే సినిమా ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు