Pooja Hegde: ఆ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన పూజా హెగ్డే..!

Pooja Hegde

టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది పూజాహెగ్డే. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా ఆఫర్లు సంపాదించి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ ప్లేస్ ని సంపాదిన్చచింది. అయితే, అలవైకుంఠపురం సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటం, ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ సినిమా కూడా నిరాశ పరచటంతో పూజకి తెలుగులో ఆఫర్లు సన్నగిల్లాయి. మరో బాలీవుడ్ లో కూడా పూజకి అదృష్టం కలిసి రాకపోవటం వల్ల అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇదిలా ఉండగా తెలుగులో గుంటూరు కారం సినిమా రూపంలో ఉన్న ఒక్కగానొక్క ఆఫర్ కూడా చేజారటంతో పూజ పరిస్థితి అయోమయంలో పడింది.

అయితే,ప్రస్తుతం సరైన ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న పూజ హెగ్డే కోసం టైర్2 హీరోలు క్యూ కడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా టైర్ 1హీరోల సినిమాల్లో నటించటానికి ప్రిఫరెన్స్ ఇచ్చిన పూజ ఇప్పుడు ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న నేపథ్యంలో చిన్న హీరోలు తమ సినిమా ఆఫర్లు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రెండు, మూడు ప్రపోజల్స్ పూజా దగ్గరికి వెళ్లగా వాటిల్లో ఏ ఆఫర్ యాక్సెప్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

పూజ లాంటి స్టార్ హీరోయిన్ గనక టైర్2 హీరోల సినిమాలో నటిస్తే ఆ సినిమాకు ఎంతో కొంత మైలేజ్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా చిన్న హీరోల సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కేవలం సాంగ్స్, గ్లామర్ షో వరకే పరిమితం కాకుండా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పత్రాలు దక్కని పూజా హెగ్డే టైర్2 హీరోల సినిమాల్లో నటించి ప్రూవ్ చేసురుకుంటుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు