Pooja Hegde : పూజా హెగ్డేకు నరకం చూపిస్తున్న స్టార్ హీరో… నిర్మాతది కూడా ఇదే మాట

Pooja Hegde : అసలే టైం బాలేదు అంటే బుట్ట బొమ్మకు ఓ స్టార్ హీరో సెట్ లో నరకం చూపిస్తున్నాడట. నిర్మాత కూడా ఇదే మాట అంటుండడం గమనార్హం. ఇంతకీ పూజ హెగ్డే కొత్త మూవీ విషయంలో అసలు ఏం జరుగుతుంది? అని వివరాల్లోకి వెళితే…

హీరో వల్ల ఆగిపోయిన ప్రాజెక్ట్…

ఇటీవల కాలంలో పెద్దగా అవకాశాలు లేక అల్లాడుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం హిందీలో సాంకి అనే మూవీ చేస్తోంది. సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సాంకి. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉండగా, ఇందులో అహన్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే అహన్ శెట్టి ఫస్ట్ మూవీ తెలుగు మూవీ ఆర్ఎక్స్ 100కు రీమేక్ గా తెరకెక్కింది. ‘తడప్’ అనే టైటిల్ తో రూపొందిన ఆయన ఫస్ట్ మూవీనే బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత అతనికి రెండవ అవకాశం ఇస్తానని సాజిద్ నదియాద్వాలా తన పాత స్నేహితుడు సునీల్ శెట్టికి ప్రామిస్ చేశాడు. ఇదే కారణంతో ఫ్లాప్ హీరో అహమ్ శెట్టితో సాంకి అనే సినిమాకు నిర్మాతగా కమిట్ అయ్యారు. అయితే ఇప్పుడు నటుడి చర్యలు నిర్మాతను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు సమాచారం. హీరో ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన నిర్మాత ఈ సినిమాను ఆపేశారట. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో ఆయన పునరాలోచనలో పడ్డట్టుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

Sanki: Ahan Shetty and Pooja Hegde's film to begin shooting on June 6 |  Filmfare.com

- Advertisement -

అహాన్ శెట్టి ఖర్చులపై నిర్మాత ఫైర్

ఇప్పుడిప్పుడే కెరీర్ ను స్టార్ట్  చేస్తున్న అహాన్ శెట్టి సెట్ లో తన టీంకు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాడట. అలా హీరో వల్ల పెరుగుతున్న ఖర్చుల కారణంగా నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలా చాలా కోపంగా ఉన్నాడని, సినిమాను ఆపివేస్తానని హీరోను బెదిరించాడని అంటున్నారు. అహన్ శెట్టి హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, చెఫ్, డ్రైవర్.. ఇలా చాలా మంది మెంబర్స్ ఖర్చును ప్రొడక్షన్ హౌస్ భరించాల్సి వస్తోందట. ఇది చాలదన్నట్టుగా అతని సినిమా హక్కులు సరైన ధరకు అమ్ముడుపోలేదు. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్‌కి విక్రయించినప్పటికీ సరైన ధర రాకపోవడంతో నిర్మాత తీవ్ర నిరాశకు గురయ్యాడు.

ఖర్చులు సునీల్ శెట్టి భరిస్తాడా ?

సాజిద్ నడియాడ్‌వాలాకు కోపం రావడంతో సునీల్ శెట్టి జోక్యం చేసుకోవలసి వచ్చిందని అంటున్నారు. తన కుమారుడి కెరీర్‌ను కాపాడేందుకు, అతని టీం మెంబర్స్ ఖర్చులను తాను తలపై వేసుకుని, సినిమా నిర్మాణ ఖర్చులను మాత్రం భరించాలని సాజిద్‌కు రిక్వెస్ట్ చేశారట సునీల్.

పూజా హెగ్డేకు కష్టకాలం

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాక ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న హిందీ మూవీ సాంకి కూడా ఇలా సమస్యల్లో పడడంతో పూజా మరింత కష్టాల్లో పడినట్టుగా అయ్యింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు