Poonam Kaur: త్రివిక్రమ్ యూస్ లెస్.. హాట్ బాంబ్ పేల్చిన పూనమ్..!

గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూనమ్ కౌర్.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరం అవుతూ పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చింది.. అలా ఆంధ్రప్రదేశ్లో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించిన పూనామ్ కౌర్.. రాజకీయాల మీద ఫోకస్ చేయడంతో సినిమాలకు దూరమైందని అందరూ అనుకున్నారు.. కానీ అలాంటి సమయంలోనే ప్రముఖ జర్నలిస్టుగా పేరుపొందిన కత్తి మహేష్ కొన్ని ఆడియోలను బయటికి తీసుకురావడం తో అవి కాస్తా సంచలనాన్ని రేపాయి.

ఆమె గురూజీ అనే పేరుతో కొన్ని విమర్శలు కూడా చేసింది.. అయితే అది త్రివిక్రమ్ అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇప్పటివరకు త్రివిక్రమ్ పేరు ఎక్కడ ఈమె స్పందించలేదు కానీ ఇప్పుడు తాజాగా యూస్ లెస్ ఫెలో అంటూ తన ట్విట్టర్ నుంచి ఒక ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. తాజాగా ఒక వెబ్ న్యూస్ పోర్టల్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ షేర్ చేస్తూ.. అందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ గురించి మాట్లాడిన తీరుతో పాటు త్రివిక్రమ్ ప్రస్తావనని తీసుకువచ్చారు.

ముఖ్యంగా త్రివిక్రమ్ రాసే డైలాగులను తాను పంచ్ డైలాగులుగా చెప్పలేకపోయానని తెలియజేశారు.. ఈ వీడియో కింద పూనమ్ కౌర్ త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అని కామెంట్ చేసింది.. అయితే మొదట ఈ అకౌంట్ ఫేక్ అకౌంట్ అని అందరూ అనుకున్నారు.. కానీ తీరా చూస్తే అది పూనమ్ కౌర్ ఒరిజినల్ అకౌంట్ నుంచి ఈ విధంగా కామెంట్ రావడంతో ప్రతి ఒక్కరు షాక్ కి గురయ్యారు. దాదాపుగా ఎన్నో సందర్భాలలో గురూజీ అనే పేరుతో పూనమ్ కౌర్ ఎన్నో సార్లు ఈ విధంగా ట్వీట్ చేస్తూనే ఉంటుంది.

- Advertisement -

అయితే ఏకంగా ఈసారి త్రివిక్రమ్ పేరుని లాగుతూ చేసిన ట్వీట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈమె అభిమానుల కూడా త్రివిక్రమ్ కు పూనమ్ కి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు అయితే దీనిపై ఇప్పటివరకు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.. త్రివిక్రమ్ కూడా ఇప్పటివరకు ఈమె చేసిన విషయాలపైన రియాక్ట్ అవ్వలేదు.. కానీ ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ ని యూజ్లెస్ ఫెలో అనడం హాట్ టాపిక్ గా మారుతోంది. కనీసం ఇకనైనా త్రివిక్రమ్ స్పందిస్తారేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు