Prabhas and Lokesh Kanagaraj : LCU లోకి ప్రభాస్ రాక కన్ఫర్మ్… ఇదే ప్రూఫ్

తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు. ఆయన క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అడుగు పెట్టడానికి పలువురు బిగ్ స్టార్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ రూమర్లు మొదలయ్యాయి. తాజాగా ఆ రూమర్లకు బలం చేకూర్చే విధంగా నెటిజన్లకు ఒక ప్రూఫ్ దొరికింది. మరి అదేంటంటే…

లోకేష్ LCU ఇదే…
లోకేష్ కనగరాజ్ సినీమాటిక్ యూనివర్స్ లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసాయి. అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలపై అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయి. కార్తీ హీరోగా “ఖైదీ” సినిమాతో లోకేష్ కనగరాజ్ యూనివర్సిటీ మొదలుపెట్టాడు ఈ డైరెక్టర్. ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన “విక్రమ్”, దళపతి విజయ్ తో “లియో” సినిమాలు చేశాడు లోకేష్. ప్రస్తుతానికి రజినికాంత్ తో లోకేష్ కొత్త మూవీని రూపొందిస్తున్నారు. ఇక లోకేష్ సాలిడ్ లైనప్ లో వీటితోపాటు ఇప్పటికే ఆయన తెరకెక్కించిన సినిమాల సీక్వెల్స్ ఉన్నాయి. ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 సినిమాలు చేయాల్సి ఉంది ఈ తమిళ డైరెక్టర్. మరోవైపు “విక్రమ్” మూవీ క్లైమాక్స్ లో సూర్య పోషించిన క్రూరమైన పాత్ర రోలెక్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్ర పేరుతోనే “రోలెక్స్” అనే మరో సినిమాను కూడా తీస్తున్నట్టుగా లోకేష్ ప్రకటించారు. ఇక త్వరలోనే ఈ లిస్ట్ లో ప్రభాస్ మూవీ కూడా చేరబోతోందని అంటున్నారు.

ప్రభాస్, లోకేష్ మూవీకి ప్రూఫ్ ఇదేనా?
ఇక రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో అదిరిపోయే మూవీ రాబోతుందని గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ కాంబో తెరపైకి రాబోతుంది అనడానికి ప్రూఫ్ ఇదే అంటూ ఓ విషయాన్ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. మార్చ్ 14న లోకి పుట్టినరోజు సందర్భంగా బెంగళూరుకు చెందిన ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి స్పెషల్ పోస్ట్ చేశారు. అందులో డైరెక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో లోకి, ప్రభాస్ మూవీ ఇదే బ్యానర్ లో నిర్మితమవుతుంది కాబట్టే వాళ్ళు ఇలా విష్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరి కేవీఎన్ లోకేష్ తో నిర్మించబోయే మూవీ ప్రభాస్ తోనేనా? లేదంటే వేరే హీరోను లైన్ లో పెడతారా ? అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -

LCU లోకి ప్రభాస్ ఎలా వచ్చాడంటే?
రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ తో “లియో” అనే బ్లాక్ బస్టర్ మూవీ చేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకు స్వస్తి చెప్పబోతుండడంతో లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లోకి ప్రభాస్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. అందుకే “లియో 2” ప్లేస్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం “విక్రమ్” మూవీలోని రోలెక్స్ పాత్ర కంటే క్రూరంగా ఉండే రోల్ ను లోకేష్ డిజైన్ చేశాడని తెలుస్తోంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు