Prabhas : ప్రభాస్ అందులో వీక్.. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాడా?

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది.. రీసెంట్ గా కల్కి సినిమాతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు.. అయితే ప్రభాస్ సినిమాలతో మంచి టాక్ ను అయితే అందుకుంటున్నాడు.. పెళ్లి విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు.. పెళ్లి వయస్సు దాటి చాలా రోజులు అయ్యింది. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.. అయితే ప్రభాస్ కి మాత్రం పెళ్లి కాకపోవడానికి ఆ వీక్నెస్ కారణమట..అదేంటో తెలుసుకుందాం..

డార్లింగ్ కు ఉన్న వీక్నెస్ అంటే వేరే ఏదో ఉందేమో అనే ఆలోచనలు వస్తాయి.. కానీ అలాంటివి ఏమి లేదు.. ఎందుకంటే ప్రభాస్ కి ఉన్న వీక్నెస్లు ఏంటంటే.. అతిగా మాట్లాడకపోవడం, తొందరగా ఎవరితోనూ కలవకపోవడం, అన్నింటికీ మించి బద్ధకం ఎక్కువ.. వీటివల్లే ప్రభాస్ ఎవరితో ఎక్కువ మాట్లాడడు.. వీటివల్లే పెళ్లి అంటే భయపడుతున్నాడట.. ఈ మూడు వీక్నెస్ ల కారణంగానే ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడం లేదట.ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. అలాగే సినిమాల్లో కెమెరా ముందు యాక్టింగ్ చేస్తాను కానీ స్టేజ్ ఎక్కి మైక్ ఇచ్చి మాట్లాడమంటే అస్సలు మాట్లాడలేను. మాటలు తడబడతాయి. స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది.. పెళ్లి చేసుకొనే అమ్మాయితో మనసు విప్పి మాట్లాడక పోతే గొడవలు వస్తాయని వెనక్కి తగ్గుతున్నాడని డార్లింగ్ సన్నిహితులు కూడా చెబుతున్నారు..

Prabhas did not get married because of that weakness
Prabhas did not get married because of that weakness

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి కూడా చెప్పాడు.. ప్రభాస్ కి ఈ జీవితంలో పెళ్లికాదు. ఎందుకంటే అతనికి చాలా బద్ధకం. పెళ్లి కోసం ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆమెతో మాట్లాడి ఆమెను ప్రేమించి, పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవడానికి చాలా బద్ధకం అందుకే పెళ్లి చేసుకోలేదు.. ఇక ముందు కూడా చేసుకుంటాడని నమ్మకం లేదని జక్కన్న చెప్పాడు.. ఇక పోతే సినిమాల విషయానికొస్తే.. తాజాగా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాడు.. ఇక లైన్లో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి.. ప్రస్తుతం వాటి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు