Prabhas – Hanu: డార్లింగ్ మూవీలో ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్.. ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్..!

Prabhas – Hanu.. పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా దూసుకుపోతున్నారు. గత ఏడాది సలార్ సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రభాస్, ఈ ఏడాది కల్కి 2898AD చిత్రంతో ఊహించని రికార్డ్ సొంతం చేసుకున్నారు. రూ .700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఒకవైపు షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించారు. అందులో భాగంగానే మొన్న పూజా కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరిగాయి. అయితే ఈ పూజా కార్యక్రమాలలో ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి సందడి చేయడం మనం గమనించవచ్చు

Prabhas - Hanu: Insta influencer in darling movie.. Shock to know the remuneration of this beauty.
Prabhas – Hanu: Insta influencer in darling movie.. Shock to know the remuneration of this beauty.

ప్రభాస్ – హను రాఘవపూడి కాంబో ఇమాన్వి..

అక్కడ ఈమెను చూసిన వారంతా ఈమె ఎందుకు ఇక్కడ ఉంది అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈమెను కన్ఫర్మ్ చేశారంటూ వార్తలు రావడం గమనార్హం. ప్రముఖ డాన్సర్ గా, యూట్యూబర్ గా మంచి పేరు దక్కించుకున్న ఇమాన్వి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్ లో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈమె ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో ఈమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరియర్ మొదలు..

అంతేకాదు నిన్న మొన్నటివరకు ఈమె గురించి తెలుగువారికి పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ ఒక్కసారిగా ప్రభాస్ సినిమాలో నటిస్తోంది అని తెలియడంతో ఫాలోవర్స్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయారు.. ఇలా యూట్యూబర్ గా, కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అయిన ఇమాన్వి మొన్నటి వరకు కేవలం ఐదు లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటిస్తోంది అని ప్రకటించిన తర్వాత ఈమెకు భారీ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈమె రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇమాన్వి పారితోషకం రూ.కోటి

ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి ఇమాన్వి ఎంత పారితోషకం తీసుకుంటుంది అనే వార్తలు బాగా వైరలవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే , యూట్యూబర్ గా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఈమె పారితోషకం అందుకుంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాతో కమిట్ అవ్వడంతో ఈమె పారితోషకం గురించి చర్చలు మొదలయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఇమాన్వి ఈ సినిమా కోసం ఏకంగా రూ.1కోటికి పైగా పారితోషకం తీసుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సక్సెస్ అయితే అదృష్టమే..

ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పటికీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో నిజంగానే ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోబోతోంది అంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఒకవేళ ఈ సినిమా గనుక నిజంగా సక్సెస్ అయిందంటే ఇమాన్వికి వరుస ఆఫర్లు తలుపు తడతాయి అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు