Prabhas – Hanu : ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు… ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన ప్రభాస్ టీం

Prabhas – Hanu : అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా చాలామందికి లైబ్రరీలో కూర్చొని ఒక పుస్తకాన్ని. ముఖ్యంగా సినిమాలోని సంభాషణలు చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అది ఒక మణిరత్నం కైండ్ ఆఫ్ సినిమా అని చాలామందికి అనిపించింది. వాస్తవానికి ఆ సినిమాలో మిధున అనే పాత్రను తెలుగు సినిమా మిస్సమ్మ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశాడు హను. సినిమాకి ప్లస్ పాయింట్ రథన్ అందించిన మ్యూజిక్. ఇప్పటికీ సీతారామం తర్వాత అంతటి బెస్ట్ వర్క్ అందాల రాక్షసి సినిమాకు మాత్రమే హను చేశాడు అని అనిపిస్తూ ఉంటుంది.

హను ప్రభాస్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా కలికి సినిమాతో వెయ్యి కోట్లు సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాల సీక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రశాంత్ దర్శకత్వంలో సలార్ సీక్వెల్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సీక్వెల్ కూడా రానున్నాయి. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగతో ఒక ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఈ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

Prabhas

- Advertisement -

హను దర్శకత్వంలో చేయబోయే సినిమా హిస్టారికల్ ఫిక్షన్ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని దర్శకుడు హను రాఘవపూడి వెల్లడించారు. అయితే ఈ కథ భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు జరిగే యుద్ధ నేపథ్యంలో ఉంటుందని ఈ సినిమాలో ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ లో కనిపిస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఇది ఒక పిరియాడిక్ సినిమా కానీ వస్తున్న వార్తలు నిజం కాదు అని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారికంగా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 17న ఆఫీసియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు