Prabhas : హనుకు షాక్… ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఆయనతో కాదట

Prabhas : పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD బ్లాక్‌బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం కల్కి సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ తీసుకున్న నిర్ణయంతో డైరెక్టర్ హను రాఘవపూడికి షాక్ తగిలినట్టే అంటున్నారు మూవీ లవర్స్. ఎందుకంటే రెబల్ స్టార్ నెక్స్ట్ చేయబోయే మూవీ ఆయనతో కాదట. మరి ప్రభాస్ నెక్స్ట్ ఏ మూవీని షురూ చేయబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ నెక్స్ట్ ఏంటి ?

కల్కి తరువాత ప్రభాస్ చిన్న విరామం తీసుకుని హను రాఘవపూడి మూవీ స్టార్ట్ చేస్తాడని రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ డార్లింగ్ మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ – 2కు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. డిసెంబర్ 2023లో ప్రభాస్ మొదటిసారిగా ప్రశాంత్ నీల్‌తో కలిసి హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన సలార్‌ మూవీలో నటించాడు. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 617 కోట్లను ఆర్జించింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య పార్ట్ టూలో గొడవ జరుగుతుంది అనే హింట్ తో ఫస్ట్ పార్ట్ కు ఎండ్ కార్డు వేశారు ప్రశాంత్. అప్పటి నుండి సలార్ సీక్వెల్ ఎప్పుడు రాబోతోంది అనే విషయంపై చాలా రూమర్లు వచ్చాయి. తాజా సమాచారం ప్రభాస్ డేట్స్ ఇవ్వడంతో ఈ ఏడాదే సలార్ సీక్వెల్ షురూ కాబోతోందని తెలుస్తోంది. ప్రభాస్ 2024 ఆగష్టు 10 నుండి సలార్ 2 షూటింగ్ ప్రారంభిస్తాడని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఎక్స్‌క్లూజివ్: ఆగస్టు 10 నుండి సాలార్ 2 కోసం ప్రభాస్ సిద్ధమవుతున్నాడు; డ్రాగన్‌తో గారడీ చేయనున్న ప్రశాంత్ నీల్

- Advertisement -

సలార్ -2 అప్పుడే అంతదాకా వచ్చిందా?

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో 15 రోజుల షెడ్యూల్‌తో సలార్ 2 ఆగష్టు 10న ప్రారంభమవుతుంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్, పృథ్వీరాజ్‌లతో సీక్వెల్‌లో 20 శాతం చిత్రీకరించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకా స్టాండింగ్ సెట్ ఉంది. ఈ సెట్‌లోనే తాజా షెడ్యూల్‌తో సలార్ 2 ప్రయాణం ప్రారంభమవుతుంది. జూన్‌లోనే షూటింగ్ ప్లాన్ చేయగా, పలు కారణాల వల్ల కొన్ని నెలలు ఆలస్యం అయ్యాయి. వర్షాలు, డేట్స్ సమస్యల కారణంగా ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట. 2025 చివరి నాటికి సలార్ సీక్వెల్‌ను విడుదల చేయాలని నిర్మాణ సంస్థ హోంబలే భావిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఆగస్టు నుండి 8 నెలల వ్యవధిలో చిత్రీకరించనున్నారు.

భారమంతా ప్రశాంత్ పైనే ?

ఈ వార్తలు గనుక నిజమైతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెండు పడవల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఇదే సమయంలో ఆయన ఎన్టీఆర్ తో మరో సినిమా షూటింగ్ ను కూడా షురూ చేయాల్సి ఉండి. అయితే ఈ విషయమై అతను ఇప్పటికే నిర్మాతలిద్దరినీ కలిసి మాట్లాడారట. ముందుగా నిర్ణయించిన టైమ్‌లైన్‌లో రెండు ఫిల్మ్‌ల కోసం షూట్ చేస్తానని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. కానీ ఇద్దరు బడా హీరోలను, వాళ్ళ షెడ్యూల్ ను ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. మరోవైపు ప్రభాస్ 2024 చివరి నుండి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే స్పిరిట్ షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు