Prabhas Remuneration : చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా… ప్రభాస్ అంటే ఇంతే మరీ

Prabhas Remuneration : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయాయి. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచాయి. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఆన్లైన్ టికెట్స్ కూడా త్వరగా ఫీల్ అవుతున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీ కాబోతున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటాడు.

Prabhas With Hanu

- Advertisement -

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ దాదాపు 125 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. ఏదేమైనా సినిమా చిన్నదైనా పెద్దదైనా కూడా ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం తేడా లేదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హను రాఘవపూడి సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు