Prabhas Role In Kalki : కల్కిలో ప్రభాస్ డ్యూయల్ రోల్… మేకర్స్ ఇక్కడ క్లూ ఇచ్చేశారు

Prabhas Role In Kalki : కల్కి మూవీ ట్రైలర్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ మూవీ స్టోరీ ఏమైవుంటుందా అని డీకోడ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అయితే వాళ్లకు అంత కష్టం ఎందుకులే అన్నట్టుగా మేకర్స్ ట్రైలర్ కంటే ముందే క్లూ ఇచ్చేశారు. ఆ క్లూ ద్వారా ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇంతకీ ఆ క్లూ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ప్రభాస్ డ్యూయల్ రోల్

ప్రభాస్ హీరోగా, దిశా పటాని, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 10న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ అభిమానులు. ఈ నేపథ్యంలోనే మూవీ స్టోరీ ఏమై ఉంటుందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. కొంతమంది తమ మెదడుకు పదును పెట్టి ట్రైలర్ ను ఢీకోడ్ చేసి కొత్త కొత్త కథలను క్రియేట్ చేశారు. అయితే నిజానికి ట్రైలర్ కంటే ముందే పోస్టర్ల ద్వారా సినిమాకు సంబంధించిన ఒక మెయిన్ క్లూ ఇచ్చారు మేకర్స్. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టుగా ఆ పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది.

Kalki 2898 AD': Prabhas, Deepika Padukone's film to release on this date | Onmanorama

- Advertisement -

ఇంతకీ పోస్టర్స్ లో ఏముందంటే…

ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లలో ఓ పోస్టర్లో ప్రభాస్ సైడ్ కి కూర్చుని కనిపించాడు. మరో పోస్టర్లో ప్రభాస్, అమితాబ్, దీపిక కలిసి కనిపించారు. ఈ రెండు పోస్టర్లను సరిగ్గా గమనిస్తే ప్రభాస్ చేతిపై ఉన్న టాటూలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇద్దరూ వేరు వేరు వ్యక్తులన్నమాట. ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా మేకర్స్ పోస్టర్స్ ద్వారా క్లూ వదిలారు. ఇప్పటిదాకా చాలామంది ఈ విషయాన్ని అసలు కనిపెట్టలేకపోయారు. కానీ ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీర్చినట్టే. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించలేదు. ఫస్ట్ టైం కల్కి 2898 మూవీలో ఆ లోటును తీర్చేయబోతున్నాడు.

కల్కి స్టోరీ ఇదే?

ఇక కల్కిలో ఆయన పాత్ర విషయానికి వస్తే ఒకటి భైరవగా, రెండు కల్కిగా కనిపించబోతున్నాడు. భైరవ డబ్బు కోసం చిన్న చిన్న పనులు, దొంగతనాలు చేస్తాడు. అశ్వద్ధామతో కూడా భైరవకు గొడవ జరుగుతుంది. మరోవైపు కల్కి పాత్ర భూమిని కాపాడేలా ఉంటుంది. ఈ పాత్ర అశ్వద్ధామకు దగ్గరగా ఉంటుంది. మరి చివరకు భైరవ, కల్కి ఎక్కడ కలుస్తారు? ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ అంటున్నారు. మరోవైపు ఇతర స్టోరీలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ పోస్టర్స్ గమనిస్తే ఇదే స్టోరీ అన్పిస్తోంది. మరిఇందులో ఏది నిజమో తెలియాలంటే కల్కి మూవీ జూలై 27న థియేటర్లలోకి వచ్చేదాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు