కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా “కన్నప్ప” అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ తారాగణంతో అత్యధిక బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. న్యూజిలాండ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇటీవల మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా “కన్నప్ప” మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో ‘మహాభారత్’ అనే సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ మూవీకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ విజువల్ వండర్ గా రూపొందుతోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం దిగ్గజ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపారు. పరుచూరి గోపాలకృష్ణ, సాయి మాధవ్ బుర్ర, తోట ప్రసాద్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో ‘కన్నప్ప’గా మంచు విష్ణు కనిపించనుండగా, ప్రభాస్ ఈ మూవీ కోసం శివుడి అవతారం ఎత్తబోతున్నాడు. ఇక నయనతార పార్వతి దేవిగా దర్శనం ఇవ్వబోతోంది. వీళ్లు మాత్రమే కాకుండా మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు వంటి దిగ్గజ నటులంతా ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘కన్నప్ప’ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ‘కన్నప్ప’ మూవీ లో గెస్ట్ రోల్ పోషించడమే ఈ మూవీకి పెద్ద ప్లస్ అని అందరూ భావిస్తుండగా, ఈ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను త్యాగం చేశాడట.
“కన్నప్ప” మూవీ కోసం ప్రభాస్ పారితోషికం తీసుకోకుండా నాలుగు రోజుల కాల్షీట్లు ఇచ్చారనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ డిమాండ్ ఓ రేంజ్ లో ఉన్న ఈ టైంలో ఇలా ‘కన్నప్ప’ కోసం నాలుగు రోజుల పాటు డేట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి మంచు ఫ్యామిలీతో ప్రభాస్ కి మంచి అనుబంధము ఉంది. కేవలం మంచు ఫ్యామిలీతోనే కాదు, ఆ మాటకొస్తే ఇండస్ట్రీలో ఉన్న అందరితోనూ ప్రభాస్ ఫ్రెండ్లీ గానే ఉంటాడు. గతంలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ నటించిన ‘రొమాంటిక్’ సినిమా ప్రమోషన్స్ కి కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రభాస్ తన ఒక్క రోజు కాల్షీట్లు ఇచ్చి హెల్ప్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు “కన్నప్ప” కోసం పారితోషికాన్ని త్యాగం చేసి మరీ, 4 రోజుల కాల్షీట్లు ఇవ్వడంతో డార్లింగ్ మంచి మనసుకు గురించి మరోసారి చర్చ మొదలైంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.