Prabhas: రాజా సాబ్ రిలీజ్ డేట్ తర్వాత ఫోకస్ అటు షిఫ్ట్ అయింది

Prabhas: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజా షాబ్. ఈ సినిమాతో ప్రభాస్ లో ఫ్యాన్స్ ఎప్పటినుంచో మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు మారుతి. అలానే ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పాటలన్నీ కూడా ఒక కమర్షియల్ ఆల్బమ్ అంటూ ఇదివరకే రీసెంట్ గా తమన్ అనౌన్స్ కూడా చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చాలా రోజుల నుంచి మిస్ అవుతున్న ప్రభాస్ వింటేజ్ లుక్ ను బయటకు తీశాడు మారుతి. మామూలుగా మారుతి సినిమాలంటేనే ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఉంటుంది ఈ సినిమా కూడా అలానే ఉండబోతుంది అని ఈ వీడియో తోనే అందరికీ క్లారిటీ వచ్చేలా చేశాడు. ఇకపోతే ఈ సినిమాను 2025 ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లు ఆ వీడియోలు రీవిల్ చేశారు. మొన్నటి వరకు ఈ సినిమా సంక్రాంతి కానుక రిలీజ్ అవుతుందని చాలామంది ఊహించారు. కానీ ఇప్పుడు సమ్మర్ కి వస్తుంది అని తెలియగానే ఫోకస్ అంతా ఇంకో సినిమా వైపు షిఫ్ట్ అయింది.

కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా తెలుగులో మంచి గుర్తింపును సాధించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా ప్రపంచమంతా కూడా కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు చూడటం మొదలుపెట్టింది. ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు తో తెలుగు హీరోలు కూడా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. కే జి ఎఫ్ సినిమాకి సీక్వల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి కాసులు వర్షం కురిపించింది.

- Advertisement -

Prabhas

ఇకపోతే అప్పటినుంచి యష్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇకపోతే ప్రస్తుతం యష్ టాక్సీక్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా 2025 ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక టాక్సిక్ సినిమాకి మంచి డేట్ దొరికింది అనుకునే టైంలో అదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రెండు సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయా లేదంటే ఎవరైనా వెనక్కు తగ్గుతారు అని తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు