Prabhas – Vijay : ప్రభాస్, కమల్ హాసన్ లతో విజయ్ మాస్టర్ ప్లాన్… ఆ థియేటర్లలో మాత్రమే

Prabhas – Vijay : ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ హడావిడి కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. అయితే కల్కి హైప్ ని క్యాష్ చేసుకోవాలని విజయ్ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇటు ప్రభాస్, అటు కమల్ హాసన్ లతో కలిసి విజయ్ త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.

కల్కి హైప్ ను క్యాష్ చేసుకోనున్న విజయ్

జూన్ 22న తలపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం గోట్ – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మేకర్స్ ఓ స్పెషల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసింది. హై ఆక్టెన్ ఛేజ్ సీక్వెన్స్ తో క్రేజీగా ఉంది ఆ వీడియో. అలాగే దళపతి విజయ్ డబుల్ ట్రబుల్ స్టిల్ కూడా ఆయన అభిమానులకు బాగా నచ్చింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న కల్కి హైప్ ను విజయ్ క్యాష్ చేసుకోబోతున్నాడు. అదెలాగంటే.. తాజా సమాచారం ప్రకారం జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న కల్కి 2898 ఏడీ థియేటర్లలో గోట్ మూవీకి సంబంధించిన యాక్షన్ గ్లిమ్స్ ప్రీ స్క్రీనింగ్ ఫీచర్ గా యాడ్ కాబోతోంది.

Thalapathy Vijay's GOAT glimpse to be attached to Prabhas' Kalki 2898 AD and Kamal Haasan starrer Indian 2 screenings?ఇండియన్ 2తో కూడా అదే ప్రయోగం

అలాగే కల్కి తర్వాత మరో పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 హడావుడి మొదలు కాబోతోంది. జూలై 12న కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 మూవీ తెరపైకి రాబోతోంది. ఈ థియేటర్లలో కూడా గోట్ మూవీ నుంచి ఓ చిన్న వీడియోను రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతానికి ఇండియన్ 2 చుట్టూ ఉన్న హైప్ చాలా తక్కువే. అయినప్పటికీ, రానున్న రోజుల్లో అది పుంజుకునే అవకాశం ఉంది. ఇలా ఈ రెండు సినిమాల థియేటర్లలో గోట్ మూవీ గ్లిమ్స్ ను ప్రత్యేకంగా రిలీజ్ చేసి తమ సినిమాకు మరింత బజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో పడ్డారు విజయ్ గోట్ మూవీ మేకర్స్. ఈ దెబ్బతో గోట్ మూవీపై మరింతగా అంచనాలు పెరిగిపోయే అవకాశం ఉంది.

- Advertisement -

గోట్ స్పెషల్ ట్రీట్

గోట్ – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది రాబోయే తమిళ భాషా చిత్రం. ఇందులో తలపతి విజయ్ హీరోగా నటిస్తుండగా, ఆయన తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్నేహ, ప్రభుదేవా, ప్రశాంత్, ప్రేమి, మీనాక్షి చౌదరి ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కళాపతి నిర్మించారు. మేకర్స్ ఇప్పటి వరకు గోట్ మూవీ నుంచి రెండు సింగిల్స్ ను విడుదల చేసారు. విజిల్ పోడు, చిన్న చిన్న కనగల్ అనే సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ రెండు పాటలను కూడా యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. తాజాగా విజయ్ 50వ పుట్టినరోజు సందర్భంగా గోట్ మూవీ నుంచి స్పెషల్ గా యాక్షన్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసి, ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు