Prabhas’s Salaar: సలార్ అదిరిపోయే రికార్డ్..!

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా కెజిఎఫ్ సంచలనం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ గురించి షాకింగ్ నంబర్స్ సర్కులేట్ అవుతున్న తరుణంలో మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, ఈ సినిమాను పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అదే గనక నిజం అయితే, ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది సలార్.

సెప్టెంబర్ 28న నాటికి సలార్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటుగా ఇంగ్లీష్ వర్షన్ ని కూడా ఎలా అయినా రెడీ చేయాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే సలార్ తెలుగు వర్షన్ కి 200కోట్ల క్రేజీ రేట్ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

బాహుబలి తర్వాత ప్రభాస్ కి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ వచ్చిన నేపథ్యంలో సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం కీలకంగా మారింది. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచిన నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. మరి, రిలీజ్ కి ముందే రోజుకో గాసిప్ తో అంచనాలు పెంచుతున్న సలార్ సినిమా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు