Anchor Pradeep: మరోసారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రదీప్..!

బుల్లితెరపై మేల్ యాంకర్ లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు.. సుమా తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ దే.. ఇండస్ట్రీలో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించారు ప్రదీప్. ప్రదీప్ కి ఎంతోమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినప్పటికీ ప్రదీప్ మాత్రం పెళ్లి అనే పదానికి దూరంగానే ఉన్నారు.. అంతేకాదు పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా.. ఆ విషయం పై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు ప్రదీప్. గతంలో బుల్లితెర పై అటు రియాలిటీ షోలలో కూడా ప్రదీప్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వినిపించినా అవన్నీ నిజం కాలేదు.

ప్రదీప్ అభిమానులు మాత్రం ప్రదీప్ పెళ్లి కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ముఖ్యంగా ఈ ఫోటోలో షేర్వానీ వేసుకొని చాలా పద్ధతిగా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు ప్రదీప్ మాచిరాజు.. దీంతో మరొకసారి పెళ్లి వార్తలకు ఆజ్యం పోసినట్టు అవుతోంది. అయితే ఈ గెటప్ మాత్రం ఏదో కొత్త ప్రోగ్రామ్ కి సంబంధించినట్టుగా కనిపిస్తోంది.

మంచు లక్ష్మి టచ్ ఫర్ చేంజ్ అనే ఈవెంట్ కస్టడీ ప్రోగ్రాం అన్నట్టుగా సమాచారం. ఇకపోతే తాజాగా ప్రదీప్ పెళ్లి పై వస్తున్న వార్తల విషయానికి వస్తే..ప్రదీప్ చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడని.. ఆమెను త్వరలోనే వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇక ప్రదీప్ ఏజ్ ప్రస్తుతం 38 ఏళ్లు. ప్రదీప్ పెళ్లి కోసం అభిమానులు మాత్రం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మరోతును వివాహం చేసుకోబోతున్నారని వార్తలైతే వినిపించాయి.

- Advertisement -

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడుతూ.. తన పెళ్లిపై వస్తున్న రూమర్లను సైతం ఖండిస్తూ.. తన పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచనలు లేవని..ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానంటూ తెలియజేశారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి రూమర్లను ఎవరూ నమ్మకండి అంటూ కూడా వెల్లడించారు. హీరోగా ఒక సినిమాలో నటించిన ప్రదీప్ ఆ తర్వాత మరే సినిమాలో కూడా హీరోగా నటించలేదు.. కానీ అప్పుడప్పుడు పలు సినిమాలలో మాత్రం కనిపిస్తూ ఉంటారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు