Prasanth Neel : కెజిఫ్ 3 తమిళ్ స్టార్ హీరో , ఇది మాములు ప్లానింగ్ కాదు

Prasanth Neel : ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు.కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక దర్శకుడుగా మంచి గుర్తింపు ప్రశాంత్ కి లభించింది. అంతకుముందు కన్నడ సినిమా అంటే పెద్దగా పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు కేజీఎఫ్ సినిమా తర్వాత ఆ సినిమాలు కూడా చూడటం మొదలుపెట్టారు. అలా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన కాంతారా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది.

కే జి ఎఫ్ సినిమాతో మార్క్ సెట్ చేశాడు

ప్రశాంత్ నీళ్ కే జి ఎఫ్ సినిమా చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక సినిమాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎంతలా ఎలివేట్ చేయొచ్చు ఈ సినిమా లో చూపించాడు ప్రశాంత్. అలానే తల్లి కొడుకులు మధ్య ఎమోషన్ కూడా పీక్ లో చూపించాడు. తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే ఒక మాస్ కమర్షియల్ సినిమాను తన పంథాలో చూపించాడు. ఈ సినిమా తర్వాత సీక్వెల్ గా కే జి ఎఫ్ టు అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సంగా హిట్టై దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.

ప్రభాస్ కి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు

ఇకపోతే ప్రశాంత్ ని తెలుగు హీరోలను కూడా లైన్ లో పెట్టాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సాధించుకున్నాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కి గురయ్యాయి. కానీ ప్రశాంత్ నేను దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ కి మంచి కం బ్యాక్ అయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు అంచనాలకు రీచ్ అయిపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా కూడా సినిమా రానున్నట్లు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు.

- Advertisement -

Yash

కేజిఎఫ్ 3 సినిమాలో తమిళ్ హీరో

తమిళ్ స్టార్ హీరో అజిత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ ని చాలామంది ఫ్యాన్స్ తలా అని పిలుస్తూ ఉంటారు. తెలుగులో కూడా అజిత్ స్టైల్ ఫిలిం చేయడానికి సిద్ధమవుతున్నాడు. తరుణంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా అజిత్ ఒక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. కే జి ఎఫ్ 3 సినిమాలో అజిత్ కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు