Prasanth Varma: రవితేజ తో కోతి కథ ప్లాన్ చేసిన పాన్ ఇండియా దర్శకుడు

Prasanth Varma: ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. అయితే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదని చాలామంది అనుకుంటారు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అని రీసెంట్ గా హనుమాన్ సినిమాలు సంబంధించిన సినిమా ఈవెంట్లో ప్రశాంత్ వర్మ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ సినిమా వల్ల నిర్మాత నాని ఎంత హ్యాపీగా ఉన్నాడో కూడా ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా కల్కి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన సినిమా హనుమాన్.

తేజ హీరోగా నటించిన ఈ సినిమాకి మొదట థియేటర్లు దొరకలేదు. కానీ మెల్లగా ఈ సినిమా మౌత్ టాక్ తో మంచి హిట్ గా మారి చాలా థియేటర్లను దక్కించుకుంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తేజ సజ్జా లాంటి హీరోతో ఇన్ని కోట్లు రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు తేజ. ఉన్నట్టుండి ప్రశాంత్ వర్మ కూడా వేరే రేంజ్ లో రేంజ్ పెరిగిపోయింది. ప్రశాంత్ సినీమాటిక్ యూనివర్సల్ అంటూ తెలుగులో కూడా మొదలుపెట్టాడు.

Prasanth Varma

- Advertisement -

హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే హనుమాన్ సినిమాలో ఒక కోతి పాత్ర ఉంటుంది. నా కోతి పాత్రకు వాయిస్ ఓవర్ రవితేజ ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన బ్యాక్ స్టోరీని ప్రశాంత్ వర్మ రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కంప్లీట్ గా రవితేజ మీద ఆధారపడి ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూర్తిస్థాయిలో రవితేజతో ప్రశాంత్ వర్మ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు