NandamooriMokshagna : నందమూరి వారసుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ ఇతనే?

NandamooriMokshagna : టాలీవుడ్ లో సినీ వారసుల ఎంట్రీ కామనే. ప్రతి సంవత్సరం స్టార్ హీరోల ఫ్యామిలీల నుండి, లేదా దర్శకనిర్మాతల ఫ్యామిలీ నుండి వారసులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ అందులో టాలెంట్ ఉన్న వాడే సక్సెస్ అవుతాడు. ఎంత రుద్దినా ప్రేక్షకులకు నచ్చకపోతే ఎన్ని కళాఖండాలు తీసినా పట్టించుకోరు. ఇక కొంతమందికి మంచి ప్రతిభ ఉన్నా నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మాత్రం నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించే. నందమూరి బాలకృష్ణ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నించో ఎదురుచూస్తున్నారు.

Prashant Varma is going to direct Nandamoori Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీకి కథలు రెడీ…

ఇక ఈ వారసుడి ఎంట్రీ కోసం ఎంతో మంది డైరెక్టర్లు కథలతో సిద్ధంగా ఉన్నారు. చాలామంది నిర్మాతలు తమ బ్యానర్ లోనే పరిచయం చేయాలనీ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీ చాలా మంది వైవిఎస్ చౌదరి, లేదా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందని అనుకున్నారు. పైగా వీళ్ళు నందమూరి బాలయ్యకు అత్యంత సన్నిహితులు. వీరే కాకుండా పూరి జగన్నాథ్ వంటి మాస్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అంటే బాలయ్య ఎంత శ్రద్ధ తీసుకుంటాడో చెప్పనక్కర్లేదు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ పై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

- Advertisement -

నందమూరి వారసుడి ఎంట్రీ ఈ దర్శకుడితోనే…

అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం నందమూరి మోక్షజ్ఞ ని సినిమాల్లోకి ప్రముఖ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పరిచయం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఇయర్ హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ని సాధించిన విషయం తెలిసిందే. అధికారికంగా ఈ విషయం అనౌన్స్ చేయలేదు గాని, ప్రశాంత్ వర్మతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ చేయాలనీ బాలకృష్ణ అనుకుంటున్నట్టు సమాచారం. నిన్నటి నుండి ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ఈ వార్త విన్న నందమూరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమా తీస్తాడో, ఎలాంటి జోనర్ లో మోక్షజ్ఞ ని పరిచయం చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు