NBK108 : నటసింహానికి జోడీగా రౌడీ హీరోయిన్

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తరువాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేయనున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ పతాకం పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సుమారు 90 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు టాక్.

ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా నటించనుందని సమాచారం.

ఇప్పటికే ఆమెపై ఓ ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలిసింది. ‘కలవరమాయే’ సినిమాతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమాతో మొదటి సక్సెస్ అందుకుంది. అనంతరం ‘తిమ్మరుసు’, ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాలలో వరుస సక్సెస్ లను అందుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా నందమూరి బాలకృష్ణ సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు