Tollywood Producer : ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్ పంచాయితి ..త్వరలో ఆర్టిస్ట్ విషయంపై ప్రెస్ మీట్..?

Tollywood Producer : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. ఓ నిర్మాత ఆర్టిస్ట్ ను శారీరకంగా వాడుకొని మోసం చేశాడనే వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. జూనియర్ ఆర్టిస్ట్ ను ప్రేమ పేరుతో నమ్మించాడు. ఆమెకు డబ్బు ఆశ చూపించి ప్రేమతో శారీరకంగా దగ్గయ్యాడు. ఇక ఏడాది పాటు ఆమెతో సీక్రెట్ యవ్వారం నడిపాడు. ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమెను వదిలేసి విదేశాలకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొడుకు పుట్టిన తర్వాత మోసపోయిన విషయం తెలుసుకున్న యువతి ఇప్పుడు ఫిలిం చాంబర్ పెద్దల ముందు తన గోడును వెళ్ళబోసుకుంది. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందేమో చూడాలి..

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బాస్టర్ సినిమాను ఆయన నిర్మించారు. ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు రాలేదని తెలుస్తుంది. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆయన నిండా అప్పుల్లో కూరుకుపోయినట్లు సన్నిహితుల వర్గాల నుంచి సమాచారం ఫీలింపై కు అందింది. ఈ అప్పుల నుంచి బయట పడేందుకు ఆయన విదేశాల్లో తల దాచుకున్నారని టాక్.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు మరో సమస్య వచ్చి పడింది. గతంలో ఓ ఆర్టిస్ట్ తో ఆయన సన్నిహితంగా ఉన్నారు. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. ఇక అమ్మాయి కూడా నమ్మింది. శారీరకంగా ఇద్దరు దగ్గరయ్యారు. కొడుకు పుట్టిన తర్వాత ప్రొడ్యూసర్ మోహం చాటేసినట్లు తెలుసుకుంది. తన ఏడాదిన్నర బాబుతో ఫిలిం చాంబర్ మెట్లేక్కింది. తనకు న్యాయం చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేసింది.

ఫిలిం చాంబర్ పంచాయతి.. ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు..

ఆ యువతి ఈ విషయం పై ప్రొడ్యూ సర్ తో చర్చించిన ఆమెకు ప్రయోజనం లేకపోవడం తో ఆమె ఫిలిం చాంబర్ పెద్దలను ఆశ్రయించింది. వాళ్లు ఈ విషయం పై బాగా పరిశీలించారు. అసలు జరిగిన విషయం పై పెద్దలు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక ఆ నిర్మాత తో కూడా చర్చినట్లు టాక్. అయితే ఆమెను పెళ్లి చేసుకోలేనని చెప్పాడట. అయితే కేవలం డబ్బులు ఇచ్చి దులిపేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఆమె మాత్రం ఆయన ఆఫర్ చేసిన దానికన్నా ఎక్కువ అడిగినట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రొడ్యూసర్ విదేశాల్లో ఉన్నాడు. త్వరలోనే ఓ ప్రెస్ మీట్ జరగనున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు