Pushpa 2 Update : పుష్ప 2 వాయిదా కన్ఫామ్… ఇక వచ్చేది ఎక్ట్స్ ఇయర్ ఉగాదికే…?

Pushpa 2 Update : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ పుష్ప 2. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం షూటింగ్ ను పూర్తి చెయ్యలేదని వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా 20 శాతం పెండింగ్ ఉందని తెలిసిందే. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సినిమాను మరోసారి వాయిదా వెయ్యబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

Pushpa 2 postponement confirmed... Next year will be Ugadi
Pushpa 2 postponement confirmed… Next year will be Ugadi

షూటింగ్ పెండింగ్..

పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఆగస్టు 15 న విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల సినిమాను డిసెంబర్ 6 న విడుదల చెయ్యనున్నట్లు కొత్త డేట్ ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు సినిమా షూటింగ్ ఇంకా 20 శాతం పెండింగ్ ఉందట. దానికి వల్ల మరోసారి వాయిదా పడబోతుందని వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.. ఇక చూసుకుంటే మళ్లీ ఉగాదికి సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

బన్నీ, సుక్కు మధ్య గొడవలు..

ఇటీవల బన్నీ, సుక్కు మధ్య గొడవలు అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే దానిపై ఇద్దరు స్పందించలేదు. ఇంకా సినిమా షూటింగ్ పెండింగ్ ఉన్నా కూడా ఇద్దరు పట్టనట్లే ఉండటంతో ఆ వార్తలు నిజమని తెలుస్తుంది. రీసెంట్ గా ఈ గొడవలకు చెక్ పెట్టేలా షూటింగ్ అప్డేట్ అంటూ ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అది ఈ రూమర్స్ కు చెక్ పెట్టడం కోసం అని తెలుస్తుంది.

- Advertisement -

ఫహాద్ ఫాజిల్ షూటింగ్ పెండింగ్..

మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్ప సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటివరకు 4 గంటలకు సరిపోయే కంటెంట్ ఉన్నా కూడా ఇంకా షూటింగ్ ఉందని పాజిల్ ను అడగటం అతనికి కోపాన్ని తెప్పించిందని టాక్. అందుకే సినిమాకు డేట్స్ ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం వల్లే సుక్కుకు బన్నికి గొడవలు అయినట్లు సమాచారం.

ఇదంతా చూస్తుంటే సినిమా షూటింగ్ పెండింగ్ ఉంది. డిసెంబర్ 6 న కూడా రాదనీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ఆ డేట్ న మంచు విష్ణు కన్నప్ప సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఇక పుష్ప 2 వచ్చే ఏడాదిలోనే విడుదల అవుతుంది. అప్పుడు మేకర్స్ డేట్ ను ఫిక్స్ కుంటేనే ఉగాదికి వస్తుంది లేకుంటే సమ్మర్ లో విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు