Pushpa 2 : ఫహాద్ వల్ల పుష్ప 2 టీంకు సుకుమార్ స్ట్రిక్ట్ రూల్

Pushpa 2 : ఏ ఏడాది ఇండియాలో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఈ మూవీ ప్రమోషన్లు షురూ చేశారు మేకర్స్. కానీ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్న ఫహాద్ ఫాజిల్ వల్ల పుష్ప 2 టీంకు సుకుమార్ స్ట్రిక్ట్ రూల్ పెట్టారట. ఆ రూల్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే..

2 నెలలు లాక్

పుష్ప 2: ది రూల్ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ సుకుమార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ మూవీ పనులు నెమ్మదిస్తున్నాయి. ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్‌గా చెక్కాలనే ఆలోచనతో చాలా టైమ్ తీసుకుంటున్నాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప 2పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాబట్టి సీక్వెల్ విషయాయంలో ఎలాంటి మిస్టేక్ జరగకూడదు అనే ఉద్దేశంతో సీరియస్ గా వర్క్ చేయడమే కాదు తెగ కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫహాద్ ఒక్కడి కోసం చిత్రబృందం మొత్తాన్ని రెండు నెలల పాటు లాక్ చేసినట్టు సమాచారం.

ఫహాద్ ఒక్కడి కోసమే ఈ నిర్ణయం

ప్రస్తుతం ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్న ఫహాద్ వల్ల డేట్స్ సమస్య నెలకొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫహాద్ ఆవేశం మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, ఓవైపు నిర్మాతగా, మరోవైపు నటుడిగా మలయాళ బాక్స్ ఆఫీసును అల్లాడిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ ఆయన డేట్స్ ఇచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఫహాద్ ఒక్కడి కోసం మిగతా ప్రధాన నటీనటుల బల్క్ డేట్స్ కావాలని అడిగారట.

- Advertisement -

Fahadh Faasil wraps up key schedule for Pushpa 2, promises vengeance in  epic face-off with Allu ...

రెండు నెలలు ఇదొక్కటే పని

ఈ క్రమంలోనే పుష్ప 2లో నటిస్తున్న సునీల్, రావు రమేష్, అనసూయ వంటి ప్రధాన నటుల బల్క్ డేట్‌లను టీమ్ సొంతం చేసుకుంది. షూటింగ్ ముగిసే వరకు అంటే రెండు నెలల పాటు ఏఎ నటినటులంతా కేవలం పుష్ప 2పై మాత్రమే ఫోకస్ చేయాలి. వేరే సినిమాల జోలికి వెళ్లకూడదు అని దీని మీనింగ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి టీమ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఫహద్ ఫాసిల్‌కి సంబంధించిన అనేక కీలకమైన సన్నివేశాలను ఇంకా సుకుమార్ చిత్రీకరించాల్సి ఉంది.

రీషూట్లు కూడా..

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప 2 : ది రూల్‌ పర్ఫెక్ట్ గా రావాలనే ఉద్దేశంతో సుకుమార్ పలు సన్నివేశాలను రీషూట్ చేసినట్టు టాక్ నడుస్తోంది. అందుకే ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఇంత ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన పుష్ప పుష్ప, సూసేకి అగ్గిరవ్వ సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రమోషన్లు షురూ చేయనున్నారు మేకర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు