Pushpa 2: సినిమాను ఊహించని లెవెల్లో ప్లాన్ చేశారు, కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పరు

Pushpa 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలలో పుష్ప ఒకటి. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ ఈ సినిమాను డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగులో మొదటి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకి నార్త్ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఈ సినిమాలోని డైలాగ్స్ ను మేనరిజంస్ ను బయట వాడటం మొదలుపెట్టారు. పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం పుష్ప సినిమా డైలాగులను వాడారు.

రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత అంత పెద్ద గుర్తింపు ఈ సినిమాకి లభించింది. అదే ఈ సినిమాకి సీక్వల్ గా పుష్ప టు రానున్న సంగతి తెలిసిందే. మొదటి ఈ సినిమాను ఆగస్టు 15 సందర్భంగా రిలీజ్ చేస్తారు అంటూ అధికారికంగా ప్రకటించేశారు. అలానే ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాను కొన్ని కారణాల వలన వాయిదా వేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను డిసెంబర్ 6 రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ అప్పుడు కూడా రిలీజ్ అవుతుందని చాలామందికి నమ్మకాలు లేవు.

Pushpa 2

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా రిలీజ్ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో జాతర సీక్రెట్స్ హైలెట్గా నిలవాలని ఉంది అనే సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి అధికారికంగా రిలీజ్ చేశారు. ఆ వీడియో ఫ్యాన్స్ తో పాటు చాలామందికి గూస్ బంప్స్ తీసుకొచ్చింది.అయితే ఈ సినిమాలో జాతర సీక్వెన్స్ తో పాటు మరో సీక్వెన్స్ కూడా ప్లాన్ చేశారట. ఈ సినిమా క్లైమాక్స్ లో హెలికాప్టర్ సన్నివేశాలను కొన్నింటిని సుకుమార్ ప్లాన్ చేశాడని, ఈ సీన్స్ అన్నీ కూడా థియేటర్లో విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

సినిమా విషయానికి వస్తే అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అలానే ఈ సినిమాకి సంబంధించి పలు రకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. వాటిలో దర్శకుడికి హీరోకి మధ్య కొద్దిపాటి వివాదాలు వచ్చినట్లు, దీనివలన హీరో గడ్డం రిమూవ్ చేసి ట్రిప్ కి వెళ్ళిపోయినట్టు కూడా తెలిసింది. ఏదేమైనా కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని అందరూ ఊహిస్తున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ మారే పరిస్థితి ఉందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు